Manchu Vishnu – Rajinikanth : కన్నప్ప సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ తీసేసాం.. మంచు విష్ణు కామెంట్స్..

తాజాగా కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి తెలిపాడు.

Manchu Vishnu – Rajinikanth : కన్నప్ప సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ తీసేసాం.. మంచు విష్ణు కామెంట్స్..

Manchu Vishnu Interesting Comments on Rajinikanth and Kannppa Movie

Updated On : June 7, 2025 / 11:00 AM IST

Manchu Vishnu – Rajinikanth : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలామంది స్టార్స్ ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఇంతమందితో పాటు రజినీకాంత్ ని కూడా తీసుకోవాలని అనుకున్నారట.

తాజాగా కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి తెలిపాడు.

Also Read : Manchu Vishnu Wife : వామ్మో.. మంచు విష్ణు భార్య అంత పెద్ద వ్యాపారవేత్తా..? 14 దేశాల్లో బిజినెస్ నడిపిస్తూ..

మంచు విష్ణు మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాలో రజినీకాంత్ గారిని కూడా తీసుకోవాలి అనుకున్నాం. ఒక క్యారెక్టర్ కూడా రాసాము. నాన్న గారి కాంబోలో ఆ క్యారెక్టర్ ఉంటుంది. కానీ ఆ సీన్స్ సినిమాలో సరిగా సెట్ అవ్వలేదు. మనకి కామియో కంటే కూడా కథ ఇంపార్టెంట్. అందుకే కథలో ఆ పాత్ర సెట్ అవ్వలేదని రజినీకాంత్ గారి కోసం రాసుకున్న క్యారెక్టర్ తీసేసాము. నాన్న గారు అడిగితే రజినీకాంత్ ఓకే అంటారు అని తెలిపారు. ఇక కన్నప్ప సినిమా జూన్ 27న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

Also Read : Manchu Vishnu : నా యాక్టింగ్ ని ఇప్పటివరకు ఎవరూ ప్రశ్నించలేదు.. నన్ను యాక్టర్ గా జనాలు ఒప్పుకున్నారు.. కానీ.. ఆర్జీవీ వల్ల..