Shivani Nagaram
Shivani Nagaram : ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా చేస్తున్న చాలా మంది మొదట చిన్న చిన్న పాత్రలతో సినీ పరిశ్రమలోకి వచ్చిన వాళ్ళే. ఇటీవల లిట్టిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ శివాని నగరం తన నటనతో అందర్నీ ఫిదా చేసేసింది.(Shivani Nagaram)
శివాని బేసిగ్ గా సింగర్. సింగర్ నుంచి అనుకోకుండా నటనలోకి వచ్చింది. శివాని నగరం మొదటి సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని అంతా అనుకుంటారు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అయితే అది హీరోయిన్ గా మొదటి సినిమా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కంటే ముందే ఓ సూపర్ హిట్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది.
Also See : Priyanka Chopra : అమెరికాలో ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివాని నగరం మాట్లాడుతూ.. నా మొదటి సినిమా జాతిరత్నాలు. జాతి రత్నాలు సినిమాలో ఓ పాత్రకు ఆడిషన్ ఇచ్చాను. చాలా చిన్న పాత్ర. న్యూస్ రిపోర్టర్ పాత్ర. దానికి సెలెక్ట్ చేసారు, యాక్టింగ్ చేశాను. సెకండ్ హాఫ్ లో ఉంటుంది ఆ పాత్ర. అది చాలా చిన్న పాత్ర కావడంతో అది ఉంటుందో ఉండదో, ఎడిటింగ్ లో తీసేస్తారు అనుకున్నాను కానీ ఆ పాత్రను ఉంచారు. అదే మొదటిసారి నటించడంతో అంత పెద్ద హిట్ అయిన సినిమాలో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని తెలిపింది.
వరుసగా హీరోయిన్ గా రెండు సూపర్ హిట్స్ కొట్టిన శివాని ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. అప్పుడప్పుడు సింగర్ గా కూడా పాటలు పాడుతుంది.
Also See : Rashmika Mandanna : ‘థామా’ సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రష్మిక మందన్న.. ఫోటోలు చూశారా?