Sangeeth Shobhan : ఈ ‘మ్యాడ్’ హీరో చిన్నప్పుడు మహేష్ ని కలిసి.. పెద్దయ్యాక మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా.. ఏ సినిమాకో తెలుసా?

మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ ఓ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని విషయం మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను అని తెలిపాడు.

Do You Know Mad Movie Hero Sangeeth Shobhan Worked as Assistant Director for Mahesh Babu Movie

Sangeeth Shobhan : మ్యాడ్ సినిమాలో ముగ్గురు హీరోల్లో సంగీత్ శోభన్ ఒకరు. బ్యాక్ టు బ్యాక్ మ్యాడ్, మ్యాడ్ సీక్వెల్ సినిమాలతో ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించి ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సంగీత్ శోభన్ సినిమాలు, సిరీస్ లతో బిజీగానే ఉన్నాడు. ఇతను డైరెక్టర్ శోభన్ కొడుకు అని కొంతమందికి తెలుసు. ప్రభాస్ తో వర్షం, మహేష్ తో బాబీ సినిమాలు తీశారు డైరెక్టర్ శోభన్.

డైరెక్టర్ శోభన్ మరణించాక ఆయన ఇద్దరు కొడుకులు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ ఇద్దరూ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ ఓ ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని విషయం మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను అని తెలిపాడు.

Also Read : Sivaji Raja – Krishnam Raju : శివాజీరాజాను బీజేపీలో జాయిన్ చేసిన కృష్ణంరాజు.. ఇవాళ్టికి నేను అదే పార్టీ.. వేరే పార్టీలో అవకాశాలు వచ్చినా..

సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. మహేష్ బాబు మహర్షి సినిమాకు నేను లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి మా నాన్న తీసిన వర్షం సినిమాకు అసోసియేట్ డైరెక్టర్. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఇంటర్న్ షిప్ చేయాలి. దాంతో పాత కాంటాక్ట్స్ వాడి మా అమ్మతో మాట్లాడించి నేను మహర్షి సినిమాకు వర్క్ చేశాను. మహర్షి సినిమాలో కాలేజీ సీన్స్ అన్ని డెహ్రాడూన్ లో షూట్ చేశారు. నెల రోజుల పాటు డెహ్రాడూన్ లో ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఈ విషయం ఎవరికీ తెలియదు అని తెలిపాడు.

అలాగే.. మహర్షి సినిమాకు పనిచేసేటప్పుడు డైరెక్ట్ మహేష్ గారితో మాట్లాడే ఛాన్స్ రాలేదు. మా నాన్న ఫస్ట్ సినిమా బాబీ. ఆ సినిమా షూటింగ్ లో చిన్నప్పుడు మహేష్ గారిని మొదటిసారి కలిసాను. అప్పుడు నాకు ఒక చాక్లెట్ ఇచ్చారు అని తెలిపాడు.

Also Read : Sivaji Raja – Chiranjeevi : ఆ రోజు చిరంజీవి మీద ప్రామిస్ చేసి.. ఇప్పటివరకు మళ్ళీ సిగరెట్ ముట్టుకోలేదు.. ఎన్నేళ్ళయిందో తెలుసా?