Sivaji Raja – Krishnam Raju : శివాజీరాజాను బీజేపీలో జాయిన్ చేసిన కృష్ణంరాజు.. ఇవాళ్టికి నేను అదే పార్టీ.. వేరే పార్టీలో అవకాశాలు వచ్చినా..

తాజాగా శివాజీరాజా తన ఫేవరేట్ పొలిటీషియన్ గురించి, తన పొలిటికల్ పార్టీ గురించి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Sivaji Raja – Krishnam Raju : శివాజీరాజాను బీజేపీలో జాయిన్ చేసిన కృష్ణంరాజు.. ఇవాళ్టికి నేను అదే పార్టీ.. వేరే పార్టీలో అవకాశాలు వచ్చినా..

Actor Sivaji Raja Tells about his Favorite Politician and his Political Journey with BJP

Updated On : May 13, 2025 / 12:22 PM IST

Sivaji Raja – Krishnam Raju : సినీ పరిశ్రమలో చాలా మంది వ్యక్తులు రాజకీయాల్లోకి కూడా అడుగుపెడతారు. కొంతమంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తారు. కొంతమంది మాత్రం తమకు నచ్చిన పార్టీలో జాయిన్ అయి సపోర్ట్ ఇస్తారు. అలా నటుడు శివాజీరాజా కూడా బీజేపీలో జాయిన్ అయ్యారట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో మెప్పించిన శివాజీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు.

తాజాగా శివాజీరాజా తన ఫేవరేట్ పొలిటీషియన్ గురించి, తన పొలిటికల్ పార్టీ గురించి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Also Read : Anasuya Bharadwaj : కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. గృహప్రవేశం ఫోటోలు చూశారా?

శివాజీరాజా మాట్లాడుతూ.. నా ఫేవరేట్ పొలిటీషియన్ వెంకయ్య నాయుడు గారు. ఆయన మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. చాలా చక్కగా పలకరిస్తారు. ఎప్పుడు కనపడినా అదే మంచితనంతో పలకరిస్తారు. కిషన్ రెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్. లక్ష్మణ్ కూడా. గతంలో కృష్ణంరాజు గారు బీజేపీలో ఎంపీగా చేసినప్పుడు నన్ను కూడా ఆయన బీజేపీలో జాయిన్ చేసారు. ఈ రోజు వరకు నేను బీజేపీలోనే ఉన్నాను. నాకు వేరే పార్టీలో అవకాశాలు వచ్చినా నేను వెళ్ళలేదు. ఒకసారి మాట అనుకున్నాను అంటే అలాగే ఉంటాను. మోడీ గారంటే కూడా చాలా ఇష్టం. అన్ని పార్టీలలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పుకొచ్చారు.

Also Read : Sivaji Raja Pet Dog : రామ్ చరణ్ దగ్గర ఉన్న కుక్కపిల్ల లాంటిదే కావాలని.. శివాజీరాజా పెంపుడు కుక్కపిల్ల కోసం.. 30 ఏళ్ళ కోరిక..