Sivaji Raja Pet Dog : రామ్ చరణ్ దగ్గర ఉన్న కుక్కపిల్ల లాంటిదే కావాలని.. శివాజీరాజా పెంపుడు కుక్కపిల్ల కోసం.. 30 ఏళ్ళ కోరిక..
రామ్ చరణ్ దగ్గర ఉన్న రైమ్ లాంటి కుక్కపిల్ల నటుడు శివాజీరాజా దగ్గర కూడా ఉంది.

Do You Know Actor Shivaji Raja also has a puppy similar to Ram Charan's Rhyme
Sivaji Raja Pet Dog : రామ్ చరణ్ దగ్గర ఉన్న పెంపుడు కుక్కపిల్ల రైమ్ గురించి అందరికి తెలిసిందే. చరణ్ తో పాటు రైమ్ కూడా స్టార్ స్టేటస్ తెచ్చేసుకుంది. చరణ్ ఎక్కడికి వెళ్లినా రైమ్ ని తీసుకెళ్తాడు. చరణ్- రైమ్ కలిసి ఉన్న ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి. తాజాగా చరణ్ మైనపు విగ్రహంతో పాటు రైమ్ కి కూడా మైనపు విగ్రహం చేసారు మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో. రైమ్ అంత ఫేమస్ అయింది. అయితే అదే బ్రీడ్ కుక్కపిల్లలు చాలా ఉంటాయని తెలిసిందే. అలా రామ్ చరణ్ దగ్గర ఉన్న రైమ్ లాంటి కుక్కపిల్ల నటుడు శివాజీరాజా దగ్గర కూడా ఉంది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీరాజా తనకు కుక్కలు అంటే ఇష్టం గురించి, తన పాత కుక్క గురించి, తన ప్రస్తుత కుక్క గురించి చెప్పుకొచ్చాడు.
శివాజీరాజా మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి కుక్కపిల్లని పెంచుకోవాలని కోరిక. చిన్నప్పుడు రోడ్డు మీద గజ్జి కుక్కని ఇంటికి తీసుకెళ్లి చూసుకునేవాడ్ని. రెండు రోజులకు అది కరిచి వెళ్లిపోయేది. అలా రెండు మూడు సార్లు జరిగింది. ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వచ్చింది. మద్రాస్ లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నప్పుడు నేను ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నా. దానివల్ల చాలా కష్టాలు పడేవాడ్ని. ఇంట్లో ఎవరూ లేకపోతే షూటింగ్ కి తీసుకువెళ్లాల్సి వచ్చేది. షూట్ లో అది ఉంటే కష్టం. ఆ కుక్క తర్వాత మా చెల్లి ఫ్యామిలీలోకి వెళ్ళింది.
అప్పట్నుంచి 30 ఏళ్లుగా కుక్కని పెంచుకోవాలని కోరిక ఉండేది. పెళ్లయ్యాక మా ఆవిడకు కుక్క అంటే భయం. అప్పట్నుంచి కుక్కని మళ్ళీ కొనలేదు. ఒకరోజు రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో వస్తుంటే అతని కుక్కపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి ముద్దులు పెట్టింది. ఆ వీడియో చూసి గత సంవత్సరం మళ్ళీ కుక్కపిల్లని కొనాలనుకున్నా. మా అబ్బాయికి చెప్తే ఇంట్లో గొడవలు అవుతాయి అన్నాడు. మీ అమ్మ వదిలేసినా పర్లేదు నాకు కుక్క కావాలి అన్నా. మా అబ్బాయి కుక్క పిల్లలు అమ్మేవాడికి ఫోన్ చేసి నాకు ఇస్తే రామ్ చరణ్ దగ్గర ఉన్న కుక్కపిల్ల లాంటిదే కావాలి అంటే రెండు తెచ్చాడు. ఆ రెండిటిని కింద వదిలితే అందులో ఒకటి నా దగ్గరికి వచ్చింది. దాన్ని తీసుకున్నాను. ఆ కుక్కపిల్ల వచ్చాక నా మనవరాలు నా మీద ప్రేమ తగ్గిపోయింది అనేది. ఆ కుక్కపిల్లతో నా కబుర్లు అన్ని చెప్తాను. నాకున్న ఆ ఒక్క కోరిక ఇప్పుడు తీరిపోయింది అని తెలిపారు. ఇక శివాజీరాజా తన కుక్కపిల్లకు యాక్షన్ అనే పేరు పెట్టారు.
Also Read : Sivaji Raja : అందుకోసం నక్సలైట్ అవుదామనుకున్నాడట.. లైసెన్స్ గన్ కూడా మెయింటైన్ చేస్తున్న శివాజీరాజా..