Sivaji Raja : అందుకోసం నక్సలైట్ అవుదామనుకున్నాడట.. లైసెన్స్ గన్ కూడా మెయింటైన్ చేస్తున్న శివాజీరాజా..
తాను యువకుడిగా ఉన్నప్పుడు నక్సలైట్ అవుదామనుకున్న విషయం గురించి కూడా చెప్పుకొచ్చారు శివాజీరాజా.

Do You Know Sivaji Raja wants to Become Naxalite
Sivaji Raja : నటుడిగా ఎన్నో సినిమాలతో మెప్పించారు శివాజీ రాజా. గతంలో వరుసగా సినిమాలు చేసిన శివాజీరాజా ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తాజాగా శివాజీ రాజా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.
ఈ క్రమంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు నక్సలైట్ అవుదామనుకున్న విషయం గురించి కూడా చెప్పుకొచ్చారు.
శివాజీ రాజా మాట్లాడుతూ.. నాకు గన్స్ అంటే పిచ్చి. నేను యంగ్ గా ఉన్నప్పుడు నక్సలైట్ అయితే నేను గన్ పట్టుకుంటాను బాగుంటుంది అనిపించేది. గన్స్ కోసమే నేను నక్సలైట్ అవుదామనుకున్నాను. కృష్ణవంశీ సింధూరం సినిమాలో రవితేజ క్యారెక్టర్ నాదే. నాకు అప్పుడు గద్దర్ ప్రభావం కూడా ఉండేది. పనిపాట లేకుండా ఉండేవాడిని. ఖాళీగా ఉన్నప్పుడు పలు విషయాలకు యంగ్ ఏజ్ లో ఆకర్షితులం అవుతాము కాబట్టి అలా అనుకునేవాడిని. ఇప్పుడు నా దగ్గర ఇంట్లో లైసెన్సుడ్ గన్ ఉంది. గతంలో ఒకటి రెండు సార్లు ఫామ్ హౌస్ లో ఖాళీగా ఊరికే పేల్చాను. ఇప్పుడు అలా పేల్చట్లేదు. అలా చేయకూడదు అని తెలిసింది అని చెప్పారు.
Also Read : Soniya Singh : రెండు నెలల్లోనే.. మరో ఖరీదైన కొత్త కార్ కొన్న నటి సోనియా సింగ్.. ఎన్ని కోట్లు తెలుసా?