×
Ad

Sudheer Babu : పర్ఫెక్ట్ బాడీతో మహేష్ బాబు బావ.. సుధీర్ బాబు డైట్ ప్లాన్ ఇదే.. ఫిట్నెస్ బిజినెస్ కూడా..

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డైట్ గురించి చెప్పుకొచ్చాడు. (Sudheer Babu)

Sudheer Babu

Sudheer Babu : మహేష్ బాబు బావ, హీరో సుధీర్ బాబు వరుస సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేసే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ప్రతి సినిమాలోనూ చాలా ఫిట్ గా కనిపిస్తారు. సోషల్ మీడియాలో కూడా తన ఫిట్నెస్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు తన సిక్స్ ప్యాక్ బాడీ కూడా చూపిస్తాడు సుధీర్ బాబు.(Sudheer Babu)

సుధీర్ బాబు నవంబర్ 7న జటాధరా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డైట్ గురించి చెప్పుకొచ్చాడు.

Also See : Sree Vishnu Daughter : హీరో శ్రీ విష్ణు కూతురు శారీ ఫంక్షన్ ఫోటోలు చూశారా? శ్రీ విష్ణు కూతురు మృద ఎంత క్యూట్ గా ఉందో..

సుధీర్ బాబు తన డైట్ గురించి మాట్లాడుతూ.. నేను రోజుకు అయిదారు సార్లు కొంచెం కొంచెం తింటాను. ఎగ్స్, మీట్, పుల్కా ఎక్కువగా తింటాను. రైస్ కూడా తింటాను. ఉదయాన్నే అయిదు ఎగ్స్ లేదా ఆమ్లెట్ తో పాటు రెండు రోటి లేదా పుల్కా, బ్రెడ్ తింటాను. ఎక్సర్‌సైజ్ కి తగ్గట్టు ప్రోటీన్ తీసుకుంటాను. మధ్యాహ్నం చికెన్, రైస్ తింటాను. వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా తింటాను. ఒకేసారి హాఫ్ కేజీ వెజిటేబుల్స్ వరకు తింటాను. అప్పుడు రైస్, మీట్ తక్కువ తింటాను. అలా కొంచెం కొంచెం రోజుకు అయిదు సార్లు తింటాను. చీట్ మీల్ రోజు ఐస్ క్రీమ్ భోజనం తిన్నట్టు తింటాను అని తన డైట్ ప్లాన్ చెప్పుకొచ్చారు.

అలాగే.. తాను సెక్రేడ్ బీస్ట్ అనే ఫిట్నెస్ కంపెనీ స్టార్ట్ చేసినట్టు తెలిపాడు. ఇందులో ప్రోటీన్ షేక్, పౌడర్లు ఉత్పత్తి చేస్తారు. ఫిట్నెస్ కి కావాల్సిన డైట్ సూచిస్తారు అని తెలిపారు.

Also Read : Chakda Xpress : వరల్డ్ కప్ గెలిచారు కదా.. ఇప్పటికైనా ఆ సినిమాని రిలీజ్ చేయండి ప్లీజ్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్..