Ram Charan
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫిట్నెస్ ఫ్రీక్ అని తెలిసిందే. అసలే ఇప్పుడు పెద్ది సినిమా కోసం చాలా ఫిట్ గా తయారయి కండలు పెంచి కనిపిస్తున్నాడు. ఇందుకు ఫుడ్ కూడా కంట్రోల్ చేస్తున్నాడు. కానీ ఆ ఒక్క ఫుడ్ విషయంలో మాత్రం కంట్రోల్ ఉండదట. తాజాగా చరణ్ భార్య ఉపాసన ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఫేవరేట్ ఫుడ్ గురించి చెప్పింది.
ఉపాసన మాట్లాడుతూ.. చరణ్ ఫేవరేట్ ఫుడ్ రసం రైస్. రసం రైస్ తో ఆమ్లెట్ తింటాడు. రసం ఉంటే చాలు ఇంకేం వద్దు. రసం అన్నం తినడం కాదు రసం తాగుతాడు కూడా. ఎప్పుడు చూడు రసం.. రసం రైస్.. అనే అడుగుతాడు. అందుకే మా అత్తమ్మాస్ కిచెన్ లో రెడీమేడ్ రసం పౌడర్ కూడా తయారుచేశాం. ఎక్కడికి వెళ్లినా వెంటనే ఆ రసం ప్యాకెట్ తీసుకెళ్లి ప్రిపేర్ చేసుకొని తింటాడు. అతనికి చాలా కంఫర్ట్ ఫుడ్ అది అని తెలిపింది.
Also Read : Mass Jathara : ‘మాస్ జాతర’ టీజర్ వచ్చేసింది.. రైల్వే పోలీస్ గా మాస్ మహారాజ..
ఇదే ఇంటర్వ్యూలో ఉపాసనకు రాగి సంగటి, మటన్ పులుసు అంటే ఇష్టం అని తెలిపింది. తన కూతురికి కూడా హెల్త్ కి మంచిదని డైలీ రాగి జావ తినిపిస్తాను అని చెప్పింది. ఇక మెగా ఫ్యామిలీ అందరూ మంచి ఫుడీస్ అని షూటింగ్స్ లేకపోతే రకరకాల వంటలతో బాగా తింటామని తెలిపింది.