Chiranjeevi : చిరంజీవి రంగంలోకి దిగి ప్రభుత్వాలతో మాట్లాడతా అన్నారు.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..

త్వరలోనే చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలవబోతున్నారని తెలుస్తుంది. (Chiranjeevi)

Chiranjeevi : చిరంజీవి రంగంలోకి దిగి ప్రభుత్వాలతో మాట్లాడతా అన్నారు.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..

Chiranjeevi

Updated On : January 6, 2026 / 3:20 PM IST
  • మన శంకర వరప్రసాద్ నిర్మాత ప్రెస్ మీట్
  • థియేటర్స్ లో టికెట్ రేట్లు, ఫుడ్ రేట్లపై స్పందన
  • ఫుడ్ రేట్లపై చిరంజీవి రియాక్షన్

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో రాబోతున్నారు. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదల మీడియాతో మాట్లాడారు.(Chiranjeevi)

అయితే ఇటీవల కొన్ని సినిమాలకు, ప్రీమియర్స్ కి టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. అంతే కాకుండా మల్టీప్లెక్స్ లతో పాటు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా పాప్ కార్న్, కూల్ డ్రింక్, ఫుడ్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని మీద ఎప్పట్నుంచో కంప్లైంట్ ఉంది. అసలు ఈ ధరలు ఎక్కువగా ఉండటం వల్లే జనాలు కూడా థియేటర్స్ కి రావడం తగ్గించేశారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also See : రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ప్రభాస్, సినిమా గురించి ఏం చెప్పాడు..

అయితే నిర్మాతలు టికెట్ రేట్ల మీద స్పందిస్తున్నా, కేవలం పెద్ద సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలకే టికెట్ రేట్లు పెంచుతున్నా పాప్ కార్న్, కూల్ డ్రింక్, ఫుడ్ విషయం మాకు సంబంధం లేదు, అది థియేటర్స్ వాళ్ళకే సంబంధం, అది ప్రభుత్వాలే చూసుకోవాలి అని అంటున్నారు. ఈ విషయంపై మన శంకర వరప్రసాద్ గారు నిర్మాతలను ప్రశ్నించారు.

సాహు గారపాటి దీనిపై స్పందిస్తూ.. టికెట్ రేట్లు సంవత్సరం మొత్తం మీద ఓ పది సినిమాలకు మాత్రమే పెంచుతున్నారు. కేవలం భారీ బడ్జెట్, పెద్ద సినిమాలకు మాత్రమే పెంచుతున్నారు. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, ఫుడ్ విషయం మా చేతుల్లో లేదు. కానీ వీటివల్ల జనాలు థియేటర్స్ కి రావడం తగ్గించేశారు అని చిరంజీవి గారు కూడా గమనించారు. త్వరలోనే చిరంజీవి ఫుడ్ రేట్ల విషయంలో రెండు ప్రభుత్వాలతో మాట్లాడతాను అని కూడా చెప్పారు. ఈ సినిమా హడావిడి, సంక్రాంతి అయ్యాక చిరంజీవి ప్రభుత్వాలను కలిసి ఈ విషయం మాట్లాడే అవకాశం ఉంది అని తెలిపారు.

Also Read : Director Maruthi : రాజాసాబ్ తో నేనిచ్చే మెసేజ్ ఇదే.. దయ్యాన్ని అయినా సరే.. మారుతి కామెంట్స్..

దీంతో త్వరలోనే చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలవబోతున్నారని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు లతో చిరంజీవికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఏపీలో తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. కాబట్టి చిరంజీవి థియేటర్స్ లో ఫుడ్ రేట్ల విషయం గురించి మాట్లాడితే ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది.