Director Maruthi : రాజాసాబ్ తో నేనిచ్చే మెసేజ్ ఇదే.. దయ్యాన్ని అయినా సరే.. మారుతి కామెంట్స్..

మారుతి 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి పలు అంశాలు తెలిపారు. (Director Maruthi)

Director Maruthi : రాజాసాబ్ తో నేనిచ్చే మెసేజ్ ఇదే.. దయ్యాన్ని అయినా సరే.. మారుతి కామెంట్స్..

Director Maruthi

Updated On : January 6, 2026 / 11:38 AM IST

Director Maruthi : మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా హారర్ ఫాంటసీ జానర్లో రాజాసాబ్ సినిమా జనవరి 9న రాబోతున్న సంగతి తెలిసిందే. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్.. లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.(Director Maruthi)

తాజాగా మారుతి 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి పలు అంశాలు తెలిపారు. ఈ క్రమంలో మీ ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని మారుతీని అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Also Read : Anala Susmitha : పల్లెటూరి పడుచులా ఢీ షో భామ.. అనాల సుస్మిత ఫొటోలు..

మారుతీ సమాధానమిస్తూ.. ప్రతి మనిషికి ఎమోషన్స్ అవసరం. నీ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ గా ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. అలాగే ఎంత పెద్ద దయ్యం అయినా, దేన్నైనా నువ్వు మెంటల్ గా ధైర్యంగా ఉంటే ఎదురించగలవు అని ఈ సినిమాలో కొత్త స్క్రీన్ ప్లే తో చెప్పాను. ఈ సినిమాలో ఉన్న నానమ్మ – మనవడు ఎమోషన్ ఎలా ఉంటుంది అని రియల్ ఎమోషన్స్ నుంచి తీసుకున్నాను. దయ్యం కథ కల్పితం అని తెలిపారు.

Also Read : Supritha – Surekhavani : తిరుమలలో తల్లీకూతుళ్లు.. సుప్రీత సురేఖవాణి ఫొటోలు..