Jai Balayya : జై బాలయ్య అంటూ థియేటర్ దగ్గర రచ్చ చేస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..
జై బాలయ్య స్లోగన్ తో హడావిడి చేస్తుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి రాధికా శరత్ కుమార్.(Jai Balayya)
Jai Balayya
- రాధిక శరత్ కుమార్ పోస్ట్
- జై బాలయ్య బ్యాండ్ తో హడావిడి
- సినిమా కోసం రాధిక గెటప్
Jai Balayya : జై బాలయ్య స్లోగన్ చాలా పాపులార్ అని తెలిసిందే. బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా లవర్స్ అందరికి జై బాలయ్య ఒక ఎమోషన్. ఏ సినిమా కి వెళ్లినా సరే, ఏ హీరో ఫ్యాన్ అయినా సరే ఒక్కసారైనా జై బాలయ్య అనాల్సిందే. ఇప్పుడు ఆ స్లోగన్ తో హడావిడి చేస్తుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి రాధికా శరత్ కుమార్.(Jai Balayya)
రాధికా శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి రాధికా శరత్ కుమార్ తలకు జై బాలయ్య అనే బ్యాండ్ కట్టుకొని ఓ థియేటర్ బయట సందడి చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలను బాలయ్య ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Also Read : Chiranjeevi : చిరంజీవి రంగంలోకి దిగి ప్రభుత్వాలతో మాట్లాడతా అన్నారు.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..
అయితే ఈ ఫొటోలు ఒక సినిమా షూటింగ్ లో తీసినవి అని తెలుస్తుంది. రాధికా శరత్ కుమార్.. హీరో శ్రీవిష్ణు చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పీరియాడిక్ కథతో తెరకెక్కనుంది. ఇందులో రాధికా బాలకృష్ణ ఫ్యాన్ గా కనిపించబోతుంది. రాధికా షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే బాలయ్య టాప్ హీరో సినిమా రిలీజ్ సమయంలో రాధిక పాత్ర థియేటర్ వద్ద హంగామా చేస్తుంది. అంటే ఇది 1994 కథతో తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.

పోస్టర్స్ లోనే రాధిక జై బాలయ్య అంటూ బాలయ్య ఫ్యాన్ లా ఒక వైబ్ తీసుకురావడంతో కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో రాధిక ఏ రేంజ్ లో హల్ చల్ చేసిందో అని చూడటానికి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also See : రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ప్రభాస్, సినిమా గురించి ఏం చెప్పాడు..
View this post on Instagram
