Do You know Rapper Bigg Boss Fame Roll Rida Real Name how he changed name
Roll Rida : ర్యాప్ సాంగ్స్ తో పేరు తెచ్చుకున్న రోల్ రైడా ఆ తర్వాత బిగ్ బాస్ కి వచ్చి బాగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ తర్వాత నటుడిగా, సింగర్ గా, లిరిసిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇటీవల కాకినాడ కాజా అనే హట్కే ర్యాప్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ పాట బాగా హిట్ అయింది.
రోల్ రైడా, శుభశ్రీ కలిసి కాకినాడ కాజా ప్రైవేట్ ర్యాప్ సాంగ్ చేసారు. ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా రోల్ రైడా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో రోల్ రైడా అనే పేరు ఎలా వచ్చింది, అతని అసలు పేరేంటో తెలిపాడు.
Also Read : Pawan Kalyan : హరిహర వీరమల్లు షూట్ నుంచి పవన్ ఫోటో లీక్.. అదిరిపోయిందిగా..
రోల్ రైడా మాట్లాడుతూ.. మొదట్నుంచి నాకు ర్యాప్ సాంగ్స్ ఇష్టం. అలా ర్యాపర్ గా మారాను. ఇలా ర్యాప్ సాంగ్స్ చేస్తుంటే ఒకరు నీ స్టేజ్ నేమ్ ఏంటి అని అడిగితే రాహుల్ ర్యాపర్ అని చెప్పాను. నువ్వు ర్యాపర్ వే కానీ అది నీ స్టేజి నేమ్ కాదు నీకంటూ ఒక స్టేజ్ నేమ్ ఉండాలి అన్నారు. అప్పుడు నేను ఎక్కువగా ఫ్లో రైడా అమెరికన్ ర్యాపర్ సాంగ్స్ బాగా వినేవాడిని. అతన్ని ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. దీంతో ఆయన పేరులోని రైడా తీసుకున్నాను, ఆయన చేసిన సాంగ్స్ లో రోల్ అనే ఒక సాంగ్ బాగా ఫేమస్. అవి రెండు కలిపి రోల్ రైడా అని పెట్టుకున్నాను. మా ఫ్రెండ్స్ కి, అందరికి చెప్తే పేరు బాగుంది అన్నారు. ఇంక అదే పేరు ఫిక్స్ అయ్యాను. నా అసలు పేరు రాహుల్ కుమార్ వెలుపల అని తెలిపాడు. దీంతో రోల్ రైడా పేరు వెనకాల ఇంత కథ ఉందా అని అతని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
రోల్ రైడా లేటెస్ట్ సెన్సేషనల్ సాంగ్ కాకినాడ కాజా మీరు కూడా చూసేయండి..