Renu Desai : ఆ సినిమాని నాలుగు సార్లు చూసాను.. పడీ పడీ నవ్వాను.. రేణు దేశాయ్ కి కూడా ఆ సూపర్ హిట్ సినిమా ఇష్టం అంట..

తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా రీసెంట్ టైమ్స్ లో తనకు బాగా నచ్చిన సినిమా గురించి మాట్లాడింది.

Do You Know Renu Desai Favorite Movie

Renu Desai : మన సెలబ్రిటీలు కూడా ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చుస్తూ ఉంటారు. కొంతమంది తమకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా రీసెంట్ టైమ్స్ లో తనకు బాగా నచ్చిన సినిమా గురించి మాట్లాడింది.

Also Read : Renu Desai – Akira Nandan : అలాంటి తప్పుడు థంబ్ నెయిల్స్ ఆపండి.. అకిరాని కొంతమంది తిడుతున్నారు..

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. అందరూ డీజే టిల్లు సినిమా గురించి మాట్లాడుతున్నారు, బాగుంది అంటున్నారు అని ఓటీటీలోకి వచ్చాక చూసాను. డీజే టిల్లు చూడకుండా మొదట పార్ట్ 2 సినిమా చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అదే సినిమాని మా ఫ్రెండ్స్ తో, నా కూతురితో.. అలా నాలుగు సార్లు చూసాను. ఆ తర్వాత డీజే టిల్లు పార్ట్ 1 చూసాను. అది కూడా బాగుంది. ఆ రెండు సినిమాలకు పడీ పడీ నవ్వాను. రీసెంట్ టైమ్స్ లో నాకు బాగా నచ్చిన సినిమా అదే, ఫుల్ గా ఎంజాయ్ చేశాను అని తెలిపింది.

Also Read : Renu Desai : నేను వేరే రిలేషన్ షిప్ లోకి వెళ్ళాలి అనుకున్నా.. కానీ పిల్లల కోసం..

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు కామెడీ థ్రిల్లర్స్ గా ప్రేక్షకులని మెప్పించి భారీ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలతో సిద్ధూ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.