Actor Chinna : సినీ పరిశ్రమలో ఉండే పలువురికి బయట కూడా అనేకమంది ప్రముఖులు రిలేషన్స్ ఉంటారని తెల్సిందే. అందులోను సినిమా – రాజకీయాల రిలేషన్స్ ఎక్కువ. అయితే ఓ సీనియర్ నటుడు ఏకంగా దివంగత మాజీ సీఎం మేనల్లుడు అని మీకు తెలుసా?
గతంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించిన నటుడు చిన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మేనల్లుడు. ఆర్జీవీ శివ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఎక్కువగా ఆర్జీవీ సినిమాలతో పేరు తెచ్చుకొని, హీరోగా, నటుడిగా పాపులర్ అయ్యాడు చిన్నా. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే చిన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సొంత చెల్లి కొడుకు చిన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిన్నా ఈ విషయం తెలిపి ఓ ఆసక్తికర సంఘటనను కూడా పంచుకున్నారు.
Also See : Samantha : సమంత లేటెస్ట్ ఫోటోలు చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
నటుడు చిన్నా మాట్లాడుతూ.. ఆయనకు నేనంటే ఇష్టం. నేను యాక్టర్ అయ్యాక హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన సీఎం అయ్యాక ఓ సారి క్యాబినెట్ అంతా పిలిచి నన్ను చూపించి ఈయన ఎవరో తెలుసా అని అంటే అందరూ యాక్టర్ చిన్నా అన్నారు. కాదు నా మేనల్లుడు అని గర్వంగా చెప్పారు ఆయన. ఆయన పేరు నేను వాడుకోదలుచుకోలేదు. అందుకే ఫోటోలు పట్టుకొని ఛాన్సుల కోసం తిరిగాను. యాక్టింగ్ ట్రైనింగ్ అయ్యాక ఒకసారి ఆయన దాసరి నారాయణరావు కి ఫోన్ చేసి నా మేనల్లుడు కొంచెం చూసుకో అన్నారు. కానీ సినీ పరిశ్రమలో రికమండేషన్స్ తో ఏవి జరగవు అని అన్నారు.
ఒక సీఎం సొంత మేనమామ అయినా ఆయన పరపతి వాడకుండా కష్టపడి సినిమాల్లోకి వచ్చి నటుడిగా ఎదిగినందు చిన్నాని అభినందించాల్సిందే. ఇక నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో యువ నేత నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రిగా ఎదుగుతూ ముఖ్యమంత్రి అయ్యారు. 1990 డిసెంబర్ నుంచి 1992 అక్టోబర్ వరకు రెండేళ్లు ఆయన ఏపీకి సీఎంగా పనిచేసారు. అనంతరం ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వహించారు.