Nupur Shikhare
Nupur Shikhare : బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, ఫిట్ నెస్ కోచ్ నూపుర్ శిఖరేల వివాహం లాస్ట్ వీక్ ముంబయిలో గ్రాండ్‌గా జరిగింది. వివాహ సమయంలో నూపుర్ వేదిక వద్దకి బనియన్ ధరించి పరుగులు తీస్తూ వచ్చారు. ఇలా రావడం వెనుక ఎమోషనల్ రీజన్ ఉందట. వీరి వివాహ వేడుకల అనంతరం వైరల్ అవుతున్న వీడియో ద్వారా ఈ విషయం తెలిసింది. ఇంతకీ కారణం ఏంటి?
Devara : దేవర ఇంగ్లీష్ లిరిక్స్‌ని గమనించారా..? అందులోనే కథ ఉందా..? తండ్రితో దేవర యుద్దమా..?
ఐరా ఖాన్-నూపుర్ శిఖరేల వివాహం జనవరి 3న ముంబయిలో జరిగింది. వీరి వివాహ వేడుకకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నూపుర్ వివాహ వేదిక వద్దకు పరుగున వచ్చి అమీర్ ఖాన్, ఐరాలను కౌగిలించుకోవడం వీడియోలో కనిపించింది. ఐరా తన భర్తని ‘ఇక స్నానం చేయబోతున్నాడు.. బై’ అని.. నూపుర్ ‘ఇప్పటి నుండి నా భార్య ఆదేశాలను పాటిస్తున్నాను’ అని ఒకరినొకరు ఆటపట్టించుకున్నారు. వేదికపై నడుస్తూ నూపుర్ ‘ నా ఇంటి నుండి ఐరా ఇంటికి నేను పరుగెత్తేవాడిని.. ఈ మార్గానికి నాకు చాలా ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది. ఎమోషనల్ రీజన్’ అని చెప్పారు.
Ethereal Studio సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోకి ‘నూపుర్ చాలా భావోద్వేగ కారణాలతో వారి వివాహ వేదిక వద్దకు పరుగులు తీస్తూ వచ్చారు. ఆ జంట భార్యాభర్తలు అవుతున్న సందర్భంలో వారి ప్రేమకు గుర్తుగా అందమైన వీడియోను పంచుకున్నారు’ అంటూ శీర్షికను యాడ్ చేసారు. ఈ విషయం తెలియక మొదట్లో బనియన్‌తో వివాహ వేదిక వద్దకు నూపుర్ రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజా వీడియో విమర్శలకు చెక్ పెట్టింది.
Vijay Deverakonda-Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకి నిశ్చితార్థం? ఫిబ్రవరిలో…!
ఐరా ఖాన్ రీసెంట్‌గా ఉదయ్‌పూర్ తాజ్ లేక్ ప్యాలెస్ నుండి కొన్ని ఫోటోలు షేర్ చేసారు. ‘వర్కవుట్ లేకుండా మా పెళ్లి జరుగుతుందా?’ అని ఐరా పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. ఐరా ‘మెంటల్ హెల్త్ సపోర్ట్’ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. నూపర్ శిఖరే ఫిట్ నెస్ ట్రైనర్‌గా అమీర్ ఖాన్, సుస్మితా సేన్ వంటి ప్రముఖులకు శిక్షణ ఇచ్చారు.