Devara : దేవర ఇంగ్లీష్ లిరిక్స్‌ని గమనించారా..? అందులోనే కథ ఉందా..? తండ్రితో దేవర యుద్దమా..?
దేవర గ్లింప్స్ ఇంగ్లీష్ లిరిక్స్‌ని గమనించారా..? అందులోనే కథ ఉందా..? తండ్రితో కొడుకు యుద్ధమే దేవర చిత్రమా..?

NTR Devara part 1 Glimpse english lyrics meaning gone viral
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా ‘దేవర’. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ ని సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు తీసుకు వచ్చారు. మాస్ యాక్షన్ తో ఈ గ్లింప్స్ ని కట్ చేస్తే.. దానికి అనిరుద్ ఇచ్చిన ఇంగ్లీష్ లిరికల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అయితే ఆ లిరిక్స్ ని మీరు గమనించారా..? అందులోనే సినిమా కథ చెబుతున్నారా..? తండ్రితో కొడుకు యుద్ధమే దేవర చిత్రమా..? అనే సందేహాలు ఆ లిరిక్స్ వింటుంటే వస్తున్నాయి.
Also read : Vijay Deverakonda-Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకి నిశ్చితార్థం? ఫిబ్రవరిలో…!
ఇంతకీ ఆ లిరిక్స్ అర్ధమేంటంటే.. “నువ్వు ఎప్పుడు సముద్రాన్ని తాకలేదు. నువ్వు ఎప్పుడు నాతో ఆడలేదు. నేను ఎప్పుడు నీ పై దయ చూపించను. నిన్ను నేను బ్రతకనివ్వను. నీ రక్తాన్ని ఏరులయ్యి పారిస్తాను” అంటూ లిరిక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ లిరిక్స్ చూస్తుంటే తనకి దూరంగా ఉన్న తండ్రి గురించి మాట్లాడుతున్నట్లు ఉన్నాయి.
గ్లింప్స్ మొత్తాన్ని ఇంగ్లీష్ లిరిక్స్ తో నడిపించగా.. చివరిలో ఎన్టీఆర్ ఓ డైలాగ్ తో ముగించారు. “ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చుసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ గ్లింప్స్ లో ఒక పెద్ద షిప్‌లో ఉన్న కంటైనర్స్ ని దేవర జనం దొంగతనం చేయడం కనిపిస్తుంది. ఇది చూస్తుంటే.. ఈ సినిమా పైరేట్స్ నేపథ్యంతో సాగే కథ అని అర్ధమవుతుంది.