Klin Kaara : చరణ్ కూతురు క్లీంకార కేర్ టేకర్‌కి జీతమెంతో తెలుసా?

చరణ్-ఉపాసనల కూతురు క్లీంకార ఆలన పాలన చూసుకుంటున్న నానీ ఎవరో తెలుసా? ఆమెను సెలబ్రిటీ నానీ అంటారట.

Klin Kaara

Klin Kaara : రామ్ చరణ్-ఉపాసనల గారాలపట్టి మెగా ప్రిన్సెస్ క్లీంకార సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్‌గా క్లీంకారను చూసుకునే కేర్ టేకర్ గురించి.. ఆమె జీతం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Klin Kaara

Bunny Vasu : అల్లు అర్జున్ కథలు వినాలంటే అతను ఉండాల్సిందే.. బన్నీవాసు ఆసక్తికర వ్యాఖ్యలు..

బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్‌ల కొడుకు తైమూర్‌ని చూసుకున్ననానీ గుర్తుందా? సెలబ్రిటీ నానీగా పేరు పొందిన సావిత్రి.  ప్రస్తుతం రామ్ చరణ్-ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకారను చూసుకుంటోందట. గతంలో సావిత్రి షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌ల దగ్గర కూడా పనిచేసారు. రామ్ చరణ్, ఉపాసన కొత్త ఇంటిని కట్టుకుని అందులోకి షిఫ్ట్ అయ్యి చాలానే రోజులు అయ్యింది. చరణ్ షూటింగ్ లతో బిజీ.. ఉపాసన అపోలో ఆసుపత్రి వ్యవహారాలతో బిజీగా ఉండటంతో క్లీంకార బాధ్యతలను సావిత్రికి అప్పగిస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారట.

Indraja Shankar : ప్రముఖ కమెడియన్ ఇంట పెళ్లి బాజాలు

ఇప్పటివరకు చరణ్, ఉపాసనలు క్లీంకారను బయటకు చూపించలేదు. తమ బిడ్డను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను సావిత్రికి అప్పగించడమే కాకుండా ఆమెకు నెలకు లక్షన్నర జీతం కూడా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీ బిడ్డల ఆలనపాలన చూసుకోవడమంటే అనుక్షణం వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుంది. సావిత్రికి అందుకే అంత జీతం చెల్లిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చరణ్ దంపతులు మాత్రం బయటకు వెల్లడించలేదు.