Do you know what Rashmika's parents call her??
Rashmika Mandanna : ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో బిజీగా ఉన్న హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అన్ని భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. విజయ్ సరసన రష్మిక నటించిన తమిళ్ వరిసు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళ్ లో రిలీజ్ కాబోతుంది. అలాగే బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా సరసన చేసిన మిషన్ మజ్ను సినిమా జనవరి 20న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
దీంతో గత కొన్ని రోజులుగా రష్మిక ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా అభిమానులతో తన ఇన్‌స్టాగ్రామ్ లో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకి రష్మిక జవాబులిచ్చింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని మిమ్మల్ని మీ పేరెంట్స్ ఏమని పిలుస్తారు అని అడగగా.. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ మోని అని పిలుస్తారు, అప్పుడప్పుడు మోవా అని పిలుస్తారు. మోని, మోవా అంటే కొడవ భాషలో కూతురు అని అర్థం అని చెప్పింది.