Janhvi Kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా ఇటీవల సెప్టెంబర్ 27న రిలీజయి ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ అని ముందు నుంచి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ సినిమా చూస్తే జాన్వీ సినిమా మొత్తం మీద అరగంట కూడా సరిగ్గా కనిపించలేదు. దీంతో ఈ మాత్రం పాత్రకు జాన్వీ కపూర్ అవసరమా అని ఆమె ఫ్యాన్స్ తిట్టుకుంటున్నారు.
కానీ జాన్వీ కనిపించిన కాసేపైనా బాగానే మెప్పించింది. తన అందంతో అలరించింది. అయితే జాన్వీకి తెలుగు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ బాగానే సెట్ అయింది అనుకున్నారు. ఇంతకీ జాన్వీకి తెలుగు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా?
Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్ ప్రోమో చూశారా..? ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?
ఆర్జేగా పాపులారిటీ తెచ్చుకున్న PVS శ్వేత జాన్వీ కపూర్ కి డబ్బింగ్ చెప్పింది. ఆర్జే గా ఫేమస్ అయిన ఈ అమ్మాయి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కెరీర్ మొదలుపెట్టింది. ఇక సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మరింత పాపులర్ అయి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రచయితగా, నటిగా కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, ఫిలిమ్స్ కి పనిచేసింది శ్వేత. త్వరలో డైరెక్టర్ గా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్వేత దేవర గురించి మాట్లాడుతూ ఈ విషయం తెలిపింది.
శ్వేత మాట్లాడుతూ.. దేవరలో జాన్వీకి నేనే డబ్బింగ్ చెప్పాను. అది ఎవరూ గుర్తుపట్టలేదు. ట్రైలర్స్ వచ్చిన తర్వాత కూడా నా వాయిస్ ని ఎవరూ గుర్తుపట్టలేదు. మన వాయిస్ ని ఎవరూ గుర్తు పట్టనప్పుడే డబ్బింగ్ ఆర్టిస్ట్ సక్సెస్ అయినట్టు. ఇటీవల చాలా సినిమాల్లో డబ్బింగ్ చెప్పాను కానీ ఎవరూ గుర్తుపట్టలేదు అని తెలిపింది.