Game Changer : గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్ ప్రోమో చూశారా..? ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

తాజాగా రిలీజ్ చేసిన గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్ ప్రోమో మీరు కూడా చూసేయండి..

Game Changer : గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్ ప్రోమో చూశారా..? ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

Ram Charan Game Changer Movie Second Song Promo Released

Updated On : September 30, 2024 / 3:45 PM IST

Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ చేసి మెప్పించిన మూవీ యూనిట్ తాజాగా రెండో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. రా మచ్చా మచ్చా.. అంటూ మాస్ బీట్ తో సాగింది ఈ పాట. అనంత శ్రీరామ్ ఈ పాట రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో నకాష్ అజీజ్ ఈ పాటని పాడారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మీరు కూడా చూసేయండి..

https://www.youtube.com/watch?v=7qAmRXuLPFw

ఇక ఈ ప్రోమోలోనే చరణ్ గ్రేస్‌తో మంచి హుక్ స్టెప్ వేసి అదరగొట్టారు. దీంతో ఈ పాటలో, సినిమాలో చరణ్ స్టెప్స్ అదిరిపోతాయని అర్ధమవుతుంది. ఈ సాంగ్ కోసం 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో షూట్ చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులను ఈ సాంగ్ కోసం తీసుకొచ్చారు. ఆయా రాష్ట్రాల్లోని సాంప్రదాయ నృత్యాలతో పాటను గణేష్ మాస్టర్ సరికొత్తగా కంపోజ్ చేసారు ఈ పాటని.

Also Read : Bigg Boss 8 : ‘మిస్ బ్యాలెన్స్ అవ్వ‌డానికి ఏ మిస్ కార‌ణం..’ నిఖిల్‌కు ఇచ్చిప‌డేసిన నాగార్జున‌

ఇక ఈ ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.