Bigg Boss 8 : ‘మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం..’ నిఖిల్‌కు ఇచ్చిపడేసిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం చివరికి వచ్చేసింది.

Bigg Boss Telugu 8 Day 27 Promo 1 Hero or Zero Game
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో నాలుగో వారం చివరికి వచ్చేసింది. ఇక ప్రతి వారం శనివారం రోజున గేమ్ పై నాగార్జున విశ్లేషణ చేసి మంచిగా ఆడిన వారిని ఎంకరేజ్ చేస్తూనే సరిగ్గా ఆడని వారిని మందలించడాన్ని చూస్తూనే ఉన్నాం. ఇక నేడు శనివారం. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. ఎవరు హీరో ఎవరు జీరో అని చెప్పాలని నాగార్జున కంటెస్టంటను కోరాడు. ఎక్కువ మంది నాగమణికంఠ జీరో అంటూ అతడి ముఖం పై రెడ్ క్రాస్ మార్క్ గుర్తును పెట్టారు. దీంతో మనోడు చాలా బాధపడ్డాడు.
నిఖిల్ జీరో అంటూ ప్రేరణ అతడి ముఖం పై గుర్తు పెట్టింది. అందరం కలిసి ఆడాలని చెప్పి.. క్లాన్‌ను ఫస్ట్ పెట్టి హౌస్‌ను పడేశాడని అనిపించిందని ప్రేరణ అంది. నీకే కాదు ప్రేరణ నాకు అనిపించింది.. సీతకు అనిపించిందని నాగార్జున అన్నారు. టాస్క్ పేరు ఏంటో చెప్పాలని నిఖిల్‌ను అడుగగా.. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పాడు. మరి నువ్వు తీసింది ఎవరి అంటూ నాగ్ ప్రశ్నించాడు.
Devara 2 : ‘దేవర’ చూశాకా ఆడియన్స్ కి వస్తున్న ప్రశ్నలు ఇవే.. పార్ట్ 2 లోనే సమాధానాలా? దేవర 2 కథేంటి?
నబీల్‌ను తీసివేయడం కరెక్ట్ నిర్ణయమేనా అని అడుగగా.. నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయిందని నిఖిల్ అన్నాడు. మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అని నాగార్జున మరో ప్రశ్న వేశాడు. నువ్వు క్లాన్ చీఫ్‌గా ఉన్నప్పుడు నీ క్లాన్‌లో రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు? అని ఎప్పుడైనా ఆలోచించావా? అని నిఖిల్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు నాగ్. ప్రొమో బట్టి చూస్తుంటే నిఖిల్‌కు నాగార్జున బాగానే క్లాస్ పీకాడని అర్థమవుతోంది.