Devara 2 : ‘దేవర’ చూశాకా ఆడియన్స్ కి వస్తున్న ప్రశ్నలు ఇవే.. పార్ట్ 2 లోనే సమాధానాలా? దేవర 2 కథేంటి?
దేవర సినిమా చూసాక ఆడియన్స్ కి ఈ ప్రశ్నలు అన్ని తలెత్తుతున్నాయి.

Devara Part 2 Movie Story Questions in Devara part 1
Devara 2 : ఎన్టీఆర్ దేవర సినిమా చూసాక ఆడియన్స్ కి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. సినిమాలో కొన్నిటికి సమాధానం లేకుండా వదిలేయడంతో అవన్నీ పార్ట్ 2 లో ఉంటాయా? అసలు ఉండవా? అని సందేహం తలెత్తుతుంది ఆడియన్స్ కి. దీంతో ఆ ప్రశ్నలకు సమాధానం ఎవరన్నా చెప్పండి అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
దేవర చూసాక ఆడియన్స్ కి కామన్ గా వచ్చే ప్రశ్నలు..
#అసలు సినిమా మొదలుపెట్టింది యతి, దయ అనే గ్యాంగ్ స్టర్స్ గురించి. కానీ సినిమాలో ఎక్కడా వాళ్ళని చూపించలేదు. దీంతో యతి, దయ ఎవరు? వాళ్ళ కథేంటి?
#మురుగన్(మురళి శర్మ) చనిపోయాడు అని చెప్తారు. కానీ ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు అని చూపించలేదు.
#సముద్రంలో చూపించిన శవాల గుట్టలు ఎవరివి? ఎవరు చంపారు?
#మురుగన్ తో ఉండే డిఎస్పీ తులసి ముఖంపై ఘాటు ఎవరు పెట్టారు?
# దేవరని చంపింది క్లైమాక్స్ లో చూపిస్తారు. అతను ఎందుకు చంపాడు?
# దేవర చనిపోయిన తర్వాత కూడా కొంతమంది మనుషులు సముద్రంలోకి వెళ్లి చనిపోతారు. అప్పటికి వర ఇంకా చిన్నపిల్లాడే. మరి ఆ మనుషులని చంపింది ఎవరు?
#సింగప్ప ఎవరు? సింగప్పకు దేవర కుటుంబానికి ఉన్న రిలేషన్ ఏంటి?
#తంగం, వర పెళ్లి అవుద్దా?
దేవర సినిమా చూసాక ఆడియన్స్ కి ఈ ప్రశ్నలు అన్ని తలెత్తుతున్నాయి. దీంతో వీటన్నిటికీ సమాధానాలు సెకండ్ పార్ట్ లోనే ఇస్తారని సరిపెట్టుకుంటున్నారు. మరి సెకండ్ పార్ట్ లో వీటన్నిటికీ సమాధానాలు ఇస్తారా చూడాలి.
Also Read : Devara Song : దేవర సినిమాలో ఆ సాంగ్ తీసేసారుగా.. పార్ట్ 2లో పెడతారా? ఇక లేనట్టేనా?
ఇక దేవర పార్ట్ 1 చూశాక దేవర పార్ట్ 2 కథే ఇదే అని ఓ కథ వైరల్ అవుతుంది. పార్ట్ 1లో యతి, దయలను పట్టుకోవడానికి వచ్చిన ఆఫీసర్ వర దగ్గరికి వెళ్లి సాయం చేయమని కోరడంతో వర యతిని పట్టుకుంటాడు అని భావిస్తున్నారు. దీంతో పాటు పైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని అనుకుంటున్నారు ఫ్యాన్స్, ఆడియన్స్.