Devara Song : దేవర సినిమాలో ఆ సాంగ్ తీసేసారుగా.. పార్ట్ 2లో పెడతారా? ఇక లేనట్టేనా?
దేవర సినిమాకు రిలీజ్ ముందు ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

NTR Janhvi Kapoor Duet Song Removed from Devara Movie Details Here
Devara Song : ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజయి ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. మొదటి రోజు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. అయితే సినిమాలో చాలా ప్రశ్నలు వచ్చాయి. వాటన్నిటికీ సమాధానం పార్ట్ 2 లోనే సమాధానం దొరుకుతుందేమో చూడాలి.
ఇక దేవర సినిమాకు రిలీజ్ ముందు ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాంగ్స్ ఫ్యాన్స్ కి మంచి ఊపు ఇచ్చాయి. అయితే సినిమాలో ఒక సాంగ్ ని తీసేసారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై తెరకెక్కించిన దావూదీ.. అనే సాంగ్ సినిమాలో లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Also Read : Sukumar : డైరెక్టర్ సుకుమార్ వాట్సాప్ DP ఎవరి ఫోటో పెట్టుకున్నారో తెలుసా..?
సినిమా రిలీజ్ ముందు దావూదీ.. వీడియో సాంగ్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ స్టెప్స్, జాన్వీ అందాలు ప్రేక్షకులని అలరించాయి. కానీ సినిమా నిడివి అప్పటికే 3 గంటలు ఉంది అందుకే నిడివి ఎక్కువైందని ఈ సాంగ్ తొలగించినట్టు సమాచారం. కనీసం చివర్లో టైటిల్స్ పై అయినా వేయాల్సింది అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
మరి దావూదీ సాంగ్ ని తెరపై ఇక చూడలేమా లేక పార్ట్ 2 లో చూపిస్తారా అంటే ఎదురుచూడాలి. సినిమాలో తీసేసారు కాబట్టే ముందే వీడియో సాంగ్ రిలీజ్ చేసారు అని పలువురు భావిస్తున్నారు. థియేటర్లో మంచి ఊపు తెప్పించే దావూదీ సాంగ్ ని మాత్రం తీసేసి ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరిచారని అభిమానులు అంటున్నారు. మరొక్కసారి ఆ దావూదీ సాంగ్ ని మీరు చూసేయండి..