Salaar : ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? సలార్‌లో ఆ పాత్ర చేసింది…

సలార్ సినిమాలో సురభి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌కి ఎంతో పేరొచ్చింది. ఈ క్యారెక్టర్ కోసం ఎంతోమందిని ఆడిషన్ చేసిన ప్రశాంత్ నీల్ ఆమెకు వెంటనే ఓకే చెప్పారు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

Salaar

Salaar : సలార్ సినిమాలో సురభి క్యారెక్టర్ అద్భుతంగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? అసలు ఆ క్యారెక్టర్ ఆమెను ఎలా వరించింది… అంటే..

Salaar Affect : PVRపై సలార్ రిలీజ్ ఎఫెక్ట్.. దారుణంగా పడిపోయిన షేర్లు

Salaar 1

సలార్ సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. ఈ సినిమాలో నటించిన నటీనటులు ఒక్కొక్కరు ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో సురభి పాత్రలో నటించిన సయ్యద్ ఫర్జానాకి మంచి పేరొచ్చింది. అసలు ఈ పాత్ర ఫర్జానాకు ఎలా వచ్చిందో.. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

సలార్ లో నటించడానికి ముందు ఓరి దేవుడా సినిమాతో పాటు ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లో నటించిందట. రెండేళ్ల వయసులో ఐపీఎల్ యాడ్ తో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలో కూడా ఫర్జానా నటించింది. పలు స్కూల్ యాడ్స్ లో నటించిన ఫర్జానాకు సలార్ లో క్యారెక్టర్ కోసం మోడల్స్ వరల్డ్ ఏజెన్సీ నుండి సెలక్ట్ చేసుకున్నారట. సురభి పాత్రకు ఎంతోమంది ఆడిషన్ కి వచ్చారని కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనని ఓకే చేశారని చెప్పారు ఫర్జానా.

Salaar: సినీ పరిశ్రమకు మరో శివగామి దొరికేసింది.. అంతా ‘సలార్’ మహిమ.. ఎలాగంటే?

ప్రభాస్ వంటి స్టార్, ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్ తో పనిచేయడం తనకు చాలా సంతోషం అనిపించిందని షూటింగ్ టైమ్ లో టీమ్ మొత్తం తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పారు ఫర్జానా. ఓవైపు స్కూల్ స్డీడీస్ మరోవైపు షూటింగ్ పూర్తి చేసారట. ఫర్జానా పాత్రకు 7 షెడ్యూల్స్ , 10 రోజుల షూట్ ఏడాది సమయం పట్టిందట. సలార్ రిలీజ్ తర్వాత స్కూల్ సిబ్బంది, ఫ్రెండ్స్ తనను అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు ఫర్జానా. సురభి పాత్రలో అందరిని మెప్పించిన ఫర్జానాకి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దా