Salaar: సినీ పరిశ్రమకు మరో శివగామి దొరికేసింది.. అంతా ‘సలార్’ మహిమ.. ఎలాగంటే?

ఇప్పుడు సలార్ సినిమాతో ఈ పోలిక నిజమైందని శ్రియారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Salaar: సినీ పరిశ్రమకు మరో శివగామి దొరికేసింది.. అంతా ‘సలార్’ మహిమ.. ఎలాగంటే?

Sriya Reddy

Updated On : December 23, 2023 / 5:06 PM IST

Sriya Reddy: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా నిన్న థియేటర్స్‌లో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో వరదరాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) సోదరిగా రాధా రామ పాత్రలో నటించారు తమిళ నటి శ్రియారెడ్డి.

ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు శ్రియారెడ్డి. సోషల్ మీడియాలో ఈ భామ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే, సలార్ సినిమాను చూసిన వారంతా శ్రియారెడ్డి పాత్రను ‘బాహుబలి’ శివగామితో పోల్చుతున్నారు.

Sriya Reddy

సినీ పరిశ్రమకు రమ్యకృష్ణలాంటి మరో గొప్ప నటి దొరికిందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తెలుగులో శ్రియారెడ్డి 2003లో అప్పుడప్పుడు అనే సినిమాలో నటించారు. 2005లో అమ్మ చెప్పింది సినిమాలో నటించి మెప్పించారు. విశాల్ హీరోగా వచ్చిన పొగరు సినిమాలో ఆమె విలన్ పాత్రలో అదరగొట్టారు.

Sriya Reddy

రజనీకాంత్ నరసింహం సినిమాలో రమ్యకృష్ణ పాత్రతో పొగరు సినిమాలో శ్రియారెడ్డి పాత్రను పోల్చి చూశారు ఫ్యాన్స్. ఇప్పుడు సలార్ సినిమాతో ఈ పోలిక నిజమైందని శ్రియారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇన్నాళ్లకు ఆమె తెలుగు సినిమాలో కనపడి మళ్లీ అలరిస్తున్నారు.

Sriya Reddy

Sriya Reddy

Salaar Collections : సలార్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాలీవుడ్‌కి మళ్ళీ టెన్షన్..