Do you remember The child star heroine in this photo
Tollywood Actress : చాలా మంది స్టార్ హీరోయిన్స్ తమ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తమకి సంబందించిన ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. అలాగే ఏమైనా పండగలు, స్పెషల్ ఈవెంట్స్ ఉంటే వాటికి కూడా ఫోటోలు పెడతారు. ఈ క్రమంలో చాలా మంది సెలెబ్రిటీస్ చిల్డ్రెస్ డే సందర్బంగా తమ తమ చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటూ పలు వీడియోలు, ఫోటోలు షేర్ షేర్ చేశారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ సైతం ఈ లిస్ట్ లోకి చేరింది.
Also Read : Tollywood Actress : పెళ్లిరోజు స్పెషల్ వీడియో.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. తన చిన్నతనంలో ఒక పెళ్లి వేడుకల్లో దిగిన ఫోటోలని షేర్ చేసుకుంది. ఆ పెళ్ళిలో తను చేసిన అల్లరి కూడా చూపించింది. అలాగే.. ” మన జీవితంలో మనకి ఇష్టమైన వధువును విడిచిపెట్టి వెళ్లలేం. వాళ్ళ పెళ్ళిలో వరుడు కంటే ఎక్కువ ఫోటోలు ఒక చిన్నారివి ఉంటాయి. ఆ చిన్నారి నేనే.. మీ మనసులోని చిన్నారిని ఎప్పటికీ మర్చిపోకండి అంటూ చిల్డ్రన్స్ డే స్పెషల్ గా విషెష్ చెప్తూ ఈ వీడియో పెట్టింది.
బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది ఈ భామ.