Abhishek Bachchan: ఇకనైనా ఈ మామ బట్టలు వేసుకోకు.. అల్లుడికి అభిషేక్ బర్త్ డే విషెష్!

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు.. అభిషేక్ బచ్చన్ సోదరి కుమారుడు అగస్త్య నందా నేడు (నవంబర్‌ 23)న 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అగస్త్యకి సోషల్ మీడియాలో పుట్టినరోజు ..

Abhishek Bachchan: ఇకనైనా ఈ మామ బట్టలు వేసుకోకు.. అల్లుడికి అభిషేక్ బర్త్ డే విషెష్!

Abhishek Bachchan

Updated On : November 23, 2021 / 3:56 PM IST

Abhishek Bachchan: మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు.. అభిషేక్ బచ్చన్ సోదరి కుమారుడు అగస్త్య నందా నేడు (నవంబర్‌ 23)న 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అగస్త్యకి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగస్త్యకు బచ్చన్ కుటుంబం బర్త్ డే విషెష్ తెలపగా మేనమామ అభిషేక్‌ బచ్చన్‌ మాత్రం కాస్త వెరైటీగా బర్త్‌ డే విషెస్‌ తెలిపాడు.

Republic: దేవాకట్టా మరో ప్రయోగం.. డైరెక్టర్ కామెంటరీతో ఓటీటీ స్ట్రీమింగ్!

పూజలో కూర్చున్న అగస్త్య చిన్ననాటి ఫొటోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేసిన అభిషేక్‌ బచ్చన్‌ అందులో ప్రేమని మామ అల్లుడి సాన్నిహిత్యాన్ని కలగలిపి విషెష్ చెప్పాడు. అభిషేక్ తన ఇన్ స్టాలో.. ’21వ హ్యాపీ బర్త్‌ డే అగస్త్య. దయ, ప్రేమ, కేరింగ్‌, బాధ్యాయుతమైన మనిషిగా ఎదగాలని కోరుకుంటున్నా.. ఇప్పుడు నువ‍్వు అధికారికంగా పెద్దవాడివి.. దయచేసి ఇకనైనా ఈ మామ బట్టలు, షూ వేసుకోకు.. నీవే సొంతగా కొనుక్కో.. లవ్‌ యూ’. అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Evaru Meelo Koteeswarulu: నీకంటే కంప్యూటర్ బెటర్.. మహేష్-తారక్ ఫన్నీ ప్రోమో!

అలాగే అగస్త్య సోదరి నవ్య నవేలి నందా తన సోదరుడికి శుభాకాంక్షలు తెలిపింది. వారిద్దరూ కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ ‘ 21 ఏళ్లుగా నువ్‌ నా గదిలోకి వచ్చి, నావైపు మౌనంగా చూసి వెళ్లి పోతావు’ అని రాసుకొచ్చింది. అలాగే అగస్త్య తల్లి శ్వేత బచ్చన్‌ కూడా శుభాకాంక్షలు తెలిపింది. అగస్త్య కూడా తాత, మేనమామ వారసత్వంతో సినిమాల్లోకి రానున్నాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)