‘దోస్తానా 2’ – క్లాప్ కొట్టారు

కార్తీక్‌ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న‘దోస్తానా 2 షూటింగ్ ప్రారంభం..

  • Publish Date - November 10, 2019 / 07:58 AM IST

కార్తీక్‌ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న‘దోస్తానా 2 షూటింగ్ ప్రారంభం..

బాలీవుడ్‌లో ప్రస్తుతం సీక్వెల్స్, బయెపిక్స్ ట్రెండ్ నడుస్తోంది.. 2008లో అభిషేక్‌ బచ్చన్, జాన్‌ అబ్రహాం, ప్రియాంకా చోప్రా నటించిన ‘దోస్తానా’ ప్రేక్షకాదరణ పొందింది.. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రానుంది.

కార్తీక్‌ ఆర్యన్, లక్ష్య, జాన్వీ కపూర్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘దోస్తానా 2’ టైటిల్ ఫిక్స్ చేశారు. కొల్లిన్‌ డి కున్హా దర్శకత్వంలో.. హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

Read Also : ‘అసురన్’ రీమేక్ : యంగ్ వెంకీ క్యారెక్టర్‌లో చైతు!

రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ పంజాబ్‌లో ప్రారంభమైంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ అమృత్‌సర్‌లో ప్రారంభమైంది. కరణ్ జోహార్ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోతో పాటు క్లాప్‌బోర్డ్‌ పట్టుకుని ఉన్న ఫోటో కూడా కార్తీక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కామెడీ, యూత్‌ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ‘దోస్తానా 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది.