×
Ad

NTR : ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎన్టీఆర్.. ఆగిపోయిన డ్రాగన్..? ఆందోళనలో ఫ్యాన్స్

ఎన్టీఆర్ కి ఆరోగ్య సమస్యలు వచ్చి డ్రాగన్ షూట్ ఆగిపోయిందని తాజా సమాచారం. (NTR)

NTR

NTR : ఎన్టీఆర్ గత సంవత్సరం వార్ 2 సినిమాతో రాగా ఆ సినిమా ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది.(NTR)

కొన్నాళ్ల క్రితం ఓ యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ గాయపడటంతో డ్రాగన్ సినిమా షూట్ ఆగిపోయింది. ఇటీవలే మళ్ళీ షూట్ మొదలుపెట్టారు. రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి రాత్రి పూట యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అయితే ఈ షూట్స్ వల్ల ఎన్టీఆర్ కి ఆరోగ్య సమస్యలు వచ్చి డ్రాగన్ షూట్ ఆగిపోయిందని తాజా సమాచారం.

Also See : Hey Bhagawan : సుహాస్ ‘హే భగవాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు..

డ్రాగన్ షూటింగ్స్ లో వరుసగా రాత్రి పూట చలిలో షూట్ చేయడం, అన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ కావడంతో ఎన్టీఆర్ కి జ్వరం, శరీర బలహీనత లాంటి సమస్యలు వచ్చాయని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని టాలీవుడ్ సమాచారం. డాక్టర్లు కొన్ని రోజులు ఎన్టీఆర్ ని విశ్రాంతి తీసుకోమని తెలిపినట్టు తెలుస్తుంది.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సమస్యలతో డ్రాగన్ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.

Also Read : Anchor Sravanthi : నటిగా ఇదే ఫస్ట్ సినిమా.. యాంకర్ స్రవంతి స్పీచ్.. ఎంత ఫ్లాప్ అయితే మాత్రం ఫస్ట్ సినిమాని మర్చిపోతారా?