Anchor Sravanthi : నటిగా ఇదే ఫస్ట్ సినిమా.. యాంకర్ స్రవంతి స్పీచ్.. ఎంత ఫ్లాప్ అయితే మాత్రం ఫస్ట్ సినిమాని మర్చిపోతారా?
ఈ సినిమాలో యాంకర్ స్రవంతి కూడా నటించింది. (Anchor Sravanthi)
Anchor Sravanthi
Anchor Sravanthi : యాంకర్ గా స్రవంతి చొకారపు ఫుల్ ఫామ్ లో ఉంది. సినిమా ఈవెంట్స్ యాంకరింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ బిజీగానే ఉంది. గతంలో బిగ్ బాస్ లో కూడా పాల్గొని ఫేమ్ తెచ్చుకుంది స్రవంతి. తాజాగా స్రవంతి నటిగా ఎంట్రీ ఇస్తుంది.(Anchor Sravanthi)
సుహాస్, శివాని నగరం జంటగా తెరకెక్కుతున్న హే భగవాన్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు నిర్వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో యాంకర్ స్రవంతి కూడా నటించింది.
Also Read : Jabardasth Racha Ravi : మేడారం జాతరలో జబర్దస్త్ రచ్చ రవి.. ఫ్యామిలీతో కలిసి అమ్మవార్లకు మొక్కులు..
ఈ ఈవెంట్లో యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. 2009లో నటి అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. కానీ ఇన్నేళ్లు పట్టింది నటి అవ్వడానికి. ఆ భగవంతుడు హే భగవాన్ తోనే లాంచ్ అవ్వాలని రాసాడేమో. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇల్లేమో దూరం..లో అన్నట్టు ఆ ధైర్యమే ఇన్నేళ్ళుగా నన్ను నడిపించింది. ఇక్కడ నిలబెట్టింది. డైరెక్టర్ గోపి గారు నా నుంచి ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను డైరెక్ట్ షూట్ కి పిలిచి ఆయనకు కావలసినట్టు నటించేలా చేసారు. ఈ సినిమాలో నేనే సర్ ప్రైజ్. సుహాస్ గారు ఈ సినిమాలో కొన్ని సీన్స్ కోసం చాలా సపోర్ట్ చేసారు. మీరు ఈ సినిమా చూసి నన్ను యాక్టర్ గా గుర్తించాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.
ఇన్నేళ్లు యాంకర్ గా మెప్పించిన స్రవంతి ఇప్పుడు నటిగా మారడంతో ఆమెని అభినందిస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే స్రవంతి ఆల్రెడీ గతంలోనే నటిగా సినిమా చేసింది. బ్యాడ్ గర్ల్స్ అనే సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రే చేసింది. మున్నా డైరెక్టర్ గా తెరకెక్కించిన బ్యాడ్ గర్ల్స్ సినిమా నెల రోజుల క్రితమే డిసెంబర్ 25న రిలీజయింది కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో స్రవంతి ఫస్ట్ సినిమా బ్యాడ్ గర్ల్స్ అయినా అది చిన్న సినిమా కాబట్టి, ఫ్లాప్ అయింది కాబట్టి ఆ సినిమా గురించి ప్రస్తావనే లేకుండా హే భగవాన్ సినిమానే మొదటి సినిమా అని చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు.
Also Read : Annagaru Vostaru : ‘అన్నగారు వస్తారు’ మూవీ రివ్యూ.. కృతిశెట్టి ఫస్ట్ తమిళ్ సినిమా ఎలా ఉందంటే..
