Drugs Case : బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరెస్టు

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్‌ అర్మాన్‌ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్‌ చేశారు.

Drug Case

Former Bigg Boss Contestant : డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్‌ అర్మాన్‌ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన టీవీ నటుడు గౌరవ్ దీక్షిత్ ఇచ్చిన సమాచారం మేరకు అర్మాన్ కోహ్లి ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. N.C.B జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో కోహ్లీ నివాసంలో విస్తృత దాడులు జరిగాయి.

Read More : US military: మరో 24నుంచి 36 గంటల్లో ఉగ్రదాడి జరగొచ్చు.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన

ఈ దాడుల్లో కోహ్లీ ఇంటి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని ఆయన నుంచి రాబట్టేందుకు N.C.B అదుపులోకి తీసుకుంది. ఆగస్టు 30 వరకు N.C.B కస్టడీకి తరలించారు. 2018లో చట్టవిరుద్ధంగా మద్యం నిల్వ చేశాడన్న ఆరోపణలపై కోహ్లీని ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసింది. అతడి ఇంట్లో 41 స్కాచ్ విస్కీ బాటిల్స్ స్టాక్‌గా పెట్టుకున్నందుకు అతడిపై కేసు నమోదు చేసింది.

Read More :CM Stalin: తనని పొగిడితే చర్యలు తప్పవు.. స్టాలిన్ మార్క్ వార్నింగ్!

ఇందులో విదేశీ మద్యం కూడా ఉంది. గతంలో అర్మాన్‌పై అతడి గర్ల్ ఫ్రెండ్ రాంధ్వ కేసు పెట్టింది. తనను శారీరకంగా హింసించినట్లు ఆరోపించింది. ఈ విషయంలో వారం రోజుల పాటు పరారీలో ఉన్న కోహ్లీని లోనావాలా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ప్రస్తుతం మళ్లీ డ్రగ్స్‌ కేసులో పోలీసులకు దొరికిపోయాడు అర్మాన్‌ కోహ్లీ.