US military: మరో 24నుంచి 36 గంటల్లో ఉగ్రదాడి జరగొచ్చు.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన

కాబూల్ విమానాశ్రయంలో మరో 24నుంచి 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉంది

US military: మరో 24నుంచి 36 గంటల్లో ఉగ్రదాడి జరగొచ్చు.. అమెరికా అధ్యక్షుడి ప్రకటన

Biden

US military commanders: కాబూల్ విమానాశ్రయంలో మరో 24నుంచి 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా మిలిటరీ కమాండర్లు గుర్తించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు. కాబూల్‌లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, విమానాశ్రయంలో తీవ్రవాద దాడుల ప్రమాదం ఉందని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 24 నుంచి 36 గంటల్లో మరో పెద్ద దాడి చేసే అవకాశం ఉందని మా కమాండర్లు చెప్పారని చెప్పుకొచ్చారు.

హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఆత్మాహుతి బాంబర్ ఘటన తర్వాత విధీవిధానాలను పర్యవేక్షించినట్లు చెప్పిన బిడెన్.. మరో తీవ్రవాద దాడి కాబూల్ ప్రాంతంలో జరిగే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించారు. బిడెన్ తన ప్రకటనలో, “ఈ ఉదయం నేను వాషింగ్టన్‌లో నా జాతీయ భద్రతా బృందాన్ని మరియు కాబూల్ విమాశ్రయం దగ్గర ఉన్న అమెరికా కమాండర్‌లను కలిశాను. అఫ్ఘానిస్తాన్‌లో ISIS-K అనే ఉగ్రవాద గ్రూపుపై అమెరికా సైన్యం చేసిన దాడిని గురించి మేము చర్చించాము. దీనికి బాధ్యులైన గ్రూపును వదిలిపెట్టొద్దని నేను చెప్పాను. కాబూల్‌లో మన సైనికులు మరియు అమాయక పౌరులపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, ఇద్దరు ముఖ్యమైన నాయకులను హతం చేసినట్లుగా కూడా వెల్లడించారు. మేం కూడా జాగ్రత్తగా ఉన్నామని అన్నారు.

ఇదే సమయంలో కాబూల్ విమానాశ్రయం దాడిలో మరణించిన అమెరికన్ సైనికులకు బిడెన్ నివాళులు అర్పించారు. కాబూల్‌లో ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, మేము పౌరులను తరలించడం కొనసాగిస్తున్నామని బిడెన్ చెప్పారు. నిన్న కాబూల్ నుంచి వందలాది మంది అమెరికన్లతో సహా 6,800 మంది అఫ్ఘాన్ పౌరులను తరలించినట్లు చెప్పారు.

విమానాశ్రయంలో గురువారం జరిగిన మారణకాండకు బాధ్యత వహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ గ్రూప్-ఖోరాసన్ (IS-K) ని లక్ష్యంగా చేసుకుని US డ్రోన్ దాడి వంటిదే మళ్లీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.