Dulquer Salmaan Lucky Baskhar Movie Five Days Collections
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయ్యారు. ఆయన నటించిన మూవీ లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 31న రిలీజ్ అయింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌కు తెచ్చుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 61.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. మెగా బ్లాక్ బాస్టర్ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.
మీనాక్షి చౌదరి కథనాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు నిర్మించారు.
సాయి కుమార్, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలను పోషించారు. బ్యాంకింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
Unstoppable 4 : హీరో సూర్య ఫోన్ నంబర్‌ను ఆయన తమ్ముడు కార్తి ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?
The 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑴𝑬𝑮𝑨 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 had an EXCELLENT 1st Monday at Box-office 🔥#LuckyBaskhar grossed over 𝟔𝟏.𝟒 𝐂𝐑+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 in 𝟓 𝐃𝐀𝐘𝐒! 💰 🤩#BlockbusterLuckyBaskhar In Cinemas Now – Book your tickets 🎟 ~ https://t.co/TyyROziA89 @dulQuer… pic.twitter.com/PzkDTav3qB
— Sithara Entertainments (@SitharaEnts) November 5, 2024