Kanguva : వామ్మో సూర్య ప్లానింగ్ మామూలుగా లేదుగా.. ప్రపంచవ్యాప్తంగా 10,000 పైగా స్క్రీన్లలో ‘కంగువా’ రిలీజ్
తమిళ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Suriya Kanguva to have a massive release on over 10000 screens
Kanguva : తమిళ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. తాజాగా ఆయన నటించిన మూవీ కంగువా. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10కి పైగా బాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఓ ఇంటర్వ్యూలో స్టూడియో గ్రీన్ నిర్మాత జి ధనంజేయన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్‌లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Unstoppable 4 : హీరో సూర్య ఫోన్ నంబర్‌ను ఆయన తమ్ముడు కార్తి ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా?
మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. తమిళనాడులో ఇప్పటికే 700 కి పైగా స్క్రీన్‌లు కన్ఫర్మ్ అయ్యాయి. సౌత్‌లో 2,500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, నార్త్‌లో దాదాపు 3,000 నుండి 3,500 స్క్రీన్‌లలో లాక్ చేశాము. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 14న 10, 000 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో ఈ చిత్రం విడుదల కానుంది అని ధనంజేయన్ అన్నారు.
సూర్య కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ 2డి, 3డి ఫార్మాట్లలో బహుళ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సూర్య రెండు పాత్రల్లో కంగువా, ఫ్రాన్సిస్ థియోడర్ గా కనిపించనున్నాడు. బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిచారు.
Chandini Chowdary : హీరోయిన్ చాందిని చౌదరికి గాయం.. కీలక నిర్ణయం తీసుకున్న తెలుగమ్మాయి..