Lucky Baskhar Collections : ‘లక్కీ భాస్కర్’ రెండు రోజుల కలెక్షన్స్.. ఎంతంటే.. దుల్కర్ కల నెరవేరుతుందా..?

మొదటి ఆట నుంచే లక్కీ భాస్కర్ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని లక్కీ అనిపించుకుంది.

Dulquer Salmaan Lucky Baskhar Movie Two Days Collections Here the Details

Lucky Baskhar Collections : దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా ‘లక్కీ భాస్కర్’ సినిమా తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ సినిమా దీపావళికి అక్టోబర్ 31న రిలీజయింది. ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు కూడా వేశారు.

Also See : Raai Laxmi : పూజలు చేస్తూ రాయ్ లక్ష్మి దీపావళి సెలబ్రేషన్స్ .. ఫొటోలు..

మొదటి ఆట నుంచే లక్కీ భాస్కర్ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని లక్కీ అనిపించుకుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా క్లీన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు. బ్యాంకింగ్ నేపథ్యంలో ఓ మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్ డబ్బులు ఎలా సంపాదించాడు అని ఆసక్తికర కథాంశంతో లక్కీ భాస్కర్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండు రోజుల్లో 26.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

మూవీ యూనిట్ అధికారికంగా ఈ కలెక్షన్స్ ప్రకటించింది. నేడు, రేపు వీకెండ్ కావడంతో నాలుగు రోజుల్లో లక్కీ భాస్కర్ సినిమా ఈజీగా 50 కోట్లు దాటేస్తుందని తెలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ ముందు దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో 100 కోట్ల కలెక్షన్ అనేది నా కల అని అన్నారు. ఇప్పటివరకు దుల్కర్ కు చాలా సినిమాలు హిట్ అయినా హైయెస్ట్ కలెక్షన్స్ సీతారామం 96 కోట్ల వద్దకు వచ్చి ఆగిపోయింది. దీంతో దుల్కర్ తన లిస్ట్ లో 100 కోట్ల సినిమా ఉండాలని ఆశిస్తున్నాడు. మరి ఈ లక్కీ భాస్కర్ సినిమాతో దుల్కర్ 100 కోట్ల కల తీరుతుందా చూడాలి.