Unstoppable 4 : దుల్క‌ర్ స‌ల్మాన్ ఎంత స్పీడ్‌తో కారు న‌డుపుతాడో తెలుసా?

ఆహా వేదిక‌గా నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు

Dulquer Salmaan reveals in Unstoppable 4 how fast he drives car

ఆహా వేదిక‌గా నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌స్టాప‌బుల్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ఇటీవ‌లే నాలుగో సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు అతిథిగా వ‌చ్చిన తొలి ఎపిసోడ్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేయ‌గా ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.

రెండో ఎపిసోడ్‌కు ల‌క్కీ భాస్క‌ర్ మూవీ టీమ్ వ‌చ్చింది. దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 31న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్ కోసం టీమ్ అన్‌స్టాప‌బుల్ షోకు వ‌చ్చింది. ముందుగా దుల్క‌ర్ స‌ల్మాన్‌ను బాల‌య్య వేదిక‌పైకి పిలిచాడు. ఏంటీ ఈ గ్లామ‌ర్‌.. న‌న్ను నేను చూసుకుంటున్న‌ట్లుగా ఉంది అని అన్నారు.

Srikanth Kidambi : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్.. కాబోయే భార్య‌తో..

ఆ త‌రువాత ఓ గేమ్ ఆడించారు. ల‌వ్ సింబ‌ల్ ఉన్న బెలూన్స్ ప‌గ‌ల‌కొట్టించారు. దుల్క‌ర్ ఒక్కొ బెలూన్ ప‌గ‌ల‌కొడుతుండ‌గా ఒక్కో హీరోయిన్ పేరు చెప్పారు బాల‌య్య‌. ఐదో త‌ర‌గ‌తి, ఎనిమిదో త‌ర‌గ‌తిలో ల‌వ్ ఉన్న‌ట్లు దుల్క‌ర్ చెప్పారు. ఆ త‌రువాత కాలేజీలోనే అని అన్నారు. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ లో బ్రేక్ తీసుకున్నావా అని బాల‌య్య అన‌డంతో ఒక్క‌సారి అక్క‌డ న‌వ్వులు విరిశాయి.

ఇక దుల్క‌ర్ స‌ల్మాన్‌కు కార్లు అంటే చాలా ఇష్టం అన్న సంగ‌తి తెలిసిందే. కారులో ఎంత స్పీడుతో వెళ్తావ‌ని బాల‌య్య అడుగ‌గా.. 300 స్పీడుతో వెళ్తాన‌ని దుల్క‌ర్ చెప్పారు. చూడండి మ‌మ్ముట్టి గారు.. మ‌నం 200 అయితే.. మీ అబ్బాయి 300 స్పీడ్‌తో వెళ‌తాడ‌ట‌ అని బాల‌య్య అనడంతో మ‌రోసారి అక్క‌డ న‌వ్వులు విరిశాయి.

Kiran Abbavaram : ట్రోల‌ర్స్‌పై కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫైర్‌..

ఇక పూర్తి ఎపిసోడ్ దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న రాత్రి 7 గంట‌ల‌కు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.