Dum Dumaare Lyrical out now from Bhairavam movie
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. ఈ ముగ్గురు హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’. ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ముగ్గురు హీరోలు ఉన్న దమ్ దుమారే అనే పాటని విడుదల చేసింది.
Single : బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న శ్రీ విష్ణు.. సింగిల్ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
భోగి మంటల్లో తోసేద్దామా బాధలు అంటూ ఈ పాట సాగుతోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది కథానాయికలుగా నటిస్తుండగా జయసుధ కీలక పాత్రను పోషిస్తున్నారు.