Single : బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న శ్రీ విష్ణు.. సింగిల్ రెండు రోజుల క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు న‌టించిన మూవీ సింగిల్.

Single : బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న శ్రీ విష్ణు.. సింగిల్ రెండు రోజుల క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

Sree Vishnu Single Movie two Days Collections

Updated On : May 11, 2025 / 10:23 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు న‌టించిన మూవీ సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా, ట్రయాంగిల్ లవ్ స్టోరీతో, కాస్త ఎమోషన్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. తొలి రోజే 4.15 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండో రోజు ఈ చిత్ర వ‌సూళ్లు పెరిగాయి.

Singer Parnika : ఆ సమయంలో నా వాయిస్ పోయింది.. డిప్రెషన్ లోకి వెళిపోయా..

రెండు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.11.2 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని ఓ పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం తెలియ‌జేసింది. ఇక నేడు (ఆదివారం ) కావ‌డంతో ఈ చిత్ర వ‌సూళ్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

కేతిక శర్మ, ఇవానా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.