Singer Parnika : ఆ సమయంలో నా వాయిస్ పోయింది.. డిప్రెషన్ లోకి వెళిపోయా..
తాజాగా ఆహా కాకమ్మ కథలు షోకి రాగా సింగర్ పర్ణిక తాను పడ్డ బాధ చెప్పుకొచ్చింది.

Singer Parnika Went to Depression Due to Loss her Voice
Singer Parnika : టాలీవుడ్ లో పలు సాంగ్స్ తో, టీవీ షోలలో తన సింగింగ్ తో మెప్పించింది సింగర్ పర్ణిక. ప్రస్తుతం సింగర్ గా, యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో కంటెంట్ చేస్తూ బిజీగానే ఉంది. సింగర్స్ కి వాయిస్ చాలా ముఖ్యం అని తెలిసిందే. కానీ సింగర్ పర్ణికకు ఒకానొక సమయంలో తన వాయిస్ పోయిందట. తాజాగా ఆహా కాకమ్మ కథలు షోకి రాగా సింగర్ పర్ణిక తాను పడ్డ బాధ చెప్పుకొచ్చింది.
Also Read : Single : శ్రీవిష్ణు అదరగొడుతున్నాడుగా.. సింగల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
సింగర్ పర్ణిక మాట్లాడుతూ.. నా ప్రగ్నెన్సీ సమయంలో వాయిస్ పోయింది అప్పుడు నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పటికి కూడా వాయిస్ పూర్తిగా సెట్ అవ్వలేదు. నా పాత సాంగ్స్ చూసుకుంటే నా వాయిస్ ఎంత బాగుందో కదా అనుకుంటాను. అది నాకు చాలా డిప్రెసివ్ ఫేజ్. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు. హార్మోన్స్ చేంజ్ వల్ల అలా జరిగింది అని తెలిసింది. ఆ సమయంలో నాకు అసలు మాట్లాడటానికి వచ్చేది కాదు. చాలా పీలగా వాయిస్ వచ్చేది. వాయిస్ ని రప్పించడానికి చాలా కష్టపడ్డా. దాని వల్ల చాలా షోస్ వదిలేసుకున్నాను. షోకి వెళ్లి ట్రై చేసినా వాయిస్ వచ్చేది కాదు అంటూ ఎమోషనల్ అయింది.
Also Read : Malla Reddy : సినిమా నిర్మాతగా మల్లారెడ్డి..? మా ప్రభుత్వం వచ్చి ఉంటే.. మల్లారెడ్డి కామెంట్స్ వైరల్..