Malla Reddy : సినిమా నిర్మాతగా మల్లారెడ్డి..? మా ప్రభుత్వం వచ్చి ఉంటే.. మల్లారెడ్డి కామెంట్స్ వైరల్..
తాజాగా మల్లారెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

Malla Reddy Wants to Produce Movies if BRS Forms Government
Malla Reddy : విద్యాసంస్థల అధినేతగా, మంత్రిగా గుర్తింపు తెచ్చుకోగా తన స్పీచ్ లతో బాగా వైరల్ అయ్యారు మల్లారెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేసారు. మల్లారెడ్డి కాలేజీలలో సినిమా ఈవెంట్స్ ఎక్కువగానే జరుగుతాయి. మల్లారెడ్డి కూడా పలు ఈవెంట్స్ కి హాజరయి తన స్పీచ్ లతో అందర్నీ మెప్పిస్తాడు, నవ్విస్తాడు. సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ మల్లారెడ్డికి క్లోజ్. మల్లారెడ్డి కాలేజీల్లో చదివిన చాలా మంది హీరోలు, హీరోయిన్స్ అయ్యారు, కొంతమంది సినీ పరిశ్రమలో పలు విభాగాలలో పనిచేస్తున్నారు.
మల్లారెడ్డికి విలన్ గా కూడా పలు సినిమా ఆఫర్స్ వచ్చాయని ఆయనే స్వయంగా ఓ ఈవెంట్లో కూడా తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హరీష్ శంకర్ కూడా మల్లారెడ్డికి ఓ అవకాశం ఇచ్చాడట, కానీ అది మల్లారెడ్డి రిజెక్ట్ చేసాడు. మల్లారెడ్డికి అనేక రకాల బిజినెస్ లు ఉన్నాయి. అయితే సినిమా నిర్మాణంలోకి కూడా వద్దామనుకున్నాడట. తాజాగా మల్లారెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్టూడెంట్స్, యూత్ కి సినిమాలంటే, సినిమా స్టార్స్ అంటే క్రేజ్ ఉంటుంది. అందుకే మా కాలేజీలో రెగ్యులర్ గా సినిమా ఈవెంట్స్ జరుగుతాయి. స్టూడెంట్స్ ఖుషి అవుతారు వాటి వల్ల. నేను కూడా సినిమాలు తీయాలనుకున్నాను. గత ఎన్నికల్లో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే సినిమాలు తీయాలి అనుకున్నాను. హోమ్ మినిస్టర్ కూడా అవుదాం అనుకున్నా. కానీ గవర్నమెంట్ రాలేదు. దాంతో సినిమా, హోమ్ మినిస్టర్ రెండు అవ్వలేదు. మీడియా శాటిలైట్ ఛానల్ కూడా పెడదాం అనుకున్నాను. ప్రస్తుతానికి నా కాలేజీలు, కాలేజీల్లో టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టాను. భవిష్యత్తులో సినిమాల గురించి ఆలోచిస్తాను అని అన్నారు.
దీంతో భవిష్యత్తులో మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మల్లారెడ్డి నిర్మాతగా సినిమాలు తీసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి మల్లారెడ్డి నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీస్తాడో చూడాలి.
Also See : Pavani Karanam : హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ లో పుష్ప 2 భామ.. ఫోటోలు చూశారా?