Aarti Ravi : హీరోపై ఫైర్ అయిన భార్య.. విడాకులు రాకుండా ఇంకో అమ్మాయితో తిరుగుతుండటంతో.. ఆర్తి ఎమోషనల్ పోస్ట్ వైరల్..
ఆర్తి రవి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా అదికాస్తా చర్చగా మారింది.

Aarti Ravi Sensational Post on his Husband Actor Jayam Ravi
Aarti Ravi : తమిళ్ హీరో జయం రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నాము అని గత సంవత్సరం ప్రకటించాడు. దానిపై జయం రవి భార్య ఆర్తి స్పందిస్తూ.. నాకు తెలియకుండానే ఆ పోస్టు పెట్టారు అంటూ భర్తపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో జయం రవి ఓ సింగర్ తో క్లోజ్ అయ్యారని వార్తలు వైరల్ అయ్యాయి.
ఇప్పటికే ఆర్తి రవి తన భర్తపై ఆరోపణలు చేస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే నిన్న జయం రవి తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ కెనిషాతో కలిసి ఓ పెళ్ళికి హాజరయ్యాడు. జయం రవి – కెనిషా ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఆర్తి రవి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టగా అదికాస్తా చర్చగా మారింది.
ఆర్తి రవి తన పోస్ట్ లో.. ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉన్నాను అంటే బలహీనురాల్ని అని కాదు. నా పిల్లలకు నేను ప్రశాంతతను ఇవ్వాలని ఇన్నాళ్లు అనుకున్నాను. అందుకే సైలెంట్ గా ఉన్నాను. నా మీద ఎన్నో విమర్శలు చేసినా సైలెంట్ గానే ఉన్నాను. నా దగ్గర నిజాలు లేక కాదు నిజాలు చెప్తే నా పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని ఎంచుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదని సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఈ రోజు అందరికి తెలిసిపోయింది. నా డివోర్స్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 18 ఏళ్లుగా నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈజీగా నన్ను వదిలి వెళ్ళిపోయాడు. కష్టనష్టాల్లో తోడు ఉంటానని మాటిచ్చిన వ్యక్తి, ప్రేమ, నమ్మకాన్ని ఇస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు దూరంగా ఉంటున్నాడు.
ఇద్దరి పిల్లల బాధ్యత నా మీద పడింది. నాకు అతను తోడుగా లేడు. ఒకప్పుడు మా కోసం కట్టిన ఇంట్లోంచి మమ్మల్ని ఇప్పుడు గెంటేస్తున్నారు. బ్యాంక్ నుంచి నోటీసులు పంపించారు, దొంగ అనే ముద్ర వేస్తున్నారు. ఒక వేళ అదే నిజం అయితే నేను నా సంపాదన గురించి ఎప్పుడో ఆలోచించుకునేదాన్ని. కానీ ప్రేమ ముఖ్యమని అనుకున్నా ఇన్నాళ్లు. నా పిల్లలకు ఇప్పుడు 10, 14 ఏళ్లు ఉన్నాయి. వారికి షాక్‌లు కాదు ఓ సెక్యూరిటీ కావాలి. వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. వారి మనసులకు గాయాలు అయ్యాయి. నేను ఇవాళ ఒక భార్యగా, ఒక మహిళగా మాట్లాడట్లేదు ఓ తల్లిగా బిడ్డల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నేను ఓడిపోతాను. నువ్వు ఈజీగా వెళ్ళిపోయి వేరే వాళ్లతో ఉంటావు. నన్ను రీప్లేస్ చేస్తావు. కానీ తండ్రిగా నీ బాధ్యత, నీ గుర్తింపును మాత్రం చెరిపేయలేవు. మన పిల్లల ఏడ్పులు నీకు కనిపించవు.
నేను ఇన్ స్టాలో నా పేరుని ఆర్తి రవి గానే ఉంచుతాను. నేను ఇంకా అతనికి మాజీ భార్య కాలేదు. విడాకులు మంజూరు అయ్యే వరకు నేను ఆయన భార్యనే. దయచేసి మీడియా మాజీ భార్య అని రాయకండి. ఇదేమీ రివేంజ్ కాదు. ఓ తల్లి తన పిల్లలను రక్షించేందుకు మంటల్లో అడుగు పెడుతుంది. నిన్ను నాన్నా అని పిలిచే నా పిల్లల కోసం నేను నిలబడతాను అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో తమిళ మీడియాలో జయం రవి – ఆర్తి రవి అంశం చర్చగా మారింది. దీనిపై జయం రవి స్పందిస్తాడేమో చూడాలి.