Vijay Deverakonda – Rashmika : ముద్దు పేరుతో పిలుస్తూ.. విజయ్ దేవరకొండ క్యూట్ ఫోటో షేర్ చేసి.. బర్త్ డే విషెష్ చెప్పిన రష్మిక..

రష్మిక నిన్న రాత్రి స్పెషల్ విషెష్ పోస్ట్ చేసింది.

Vijay Deverakonda – Rashmika : ముద్దు పేరుతో పిలుస్తూ.. విజయ్ దేవరకొండ క్యూట్ ఫోటో షేర్ చేసి.. బర్త్ డే విషెష్ చెప్పిన రష్మిక..

Rashmika Mandanna Special Birth Day Wishes to Vijay Deverakonda with Cute Nick Name

Updated On : May 10, 2025 / 8:54 AM IST

Vijay Deverakonda – Rashmika : రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ కలిసి రెండు సినిమాల్లో నటించారు. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఒకరింట్లో ఒకరు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం, కలిసి వెకేషన్ కి వెళ్లడం, ఫోటోలు లీక్ అవ్వడంతో అందరూ వీరిద్దర్నీ లవ్ బర్డ్స్ అనే అనుకుంటున్నారు. రష్మిక – విజయ్ మాత్రం వీటికి రెస్పాన్స్ అవ్వకుండా ఇంకా ఆ రూమర్లు పెరిగేలా పోస్టులు పెడుతూ ఉంటారు.

ఇటీవల రష్మిక పుట్టిన రోజుని విజయ్, రష్మిక కలిసి ఒమన్ దేశంలో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే నిన్న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. రష్మిక ఇంకా విషెష్ చెప్పలేదేంటి అని భావిస్తుండగా నిన్న రాత్రి స్పెషల్ విషెష్ పోస్ట్ చేసింది.

Also Read : Raghavendra Rao : నా పని అయిపొయింది అన్నారు.. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్.. కానీ చిరంజీవి వల్లే.. రాఘవేంద్రరావు ఎమోషనల్..

రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ దేవరకొండ క్యూట్ ఫోటో షేర్ చేసి.. నేను లేట్ గా చెప్తున్నాను అని తెలుసు కానీ హ్యాపీ బర్త్ డే విజ్జు.. నువ్వు ప్రతిరోజు సంతోషంగా, ఆరోగ్యంగా, నవ్వుతూ, ప్రశాంతంగా ఉండాలని, నువ్వు కోరుకున్న ప్రతీది అందుకోవాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. విజయ్ ని రష్మిక విజ్జు అని ప్రేమగా పిలుస్తుందని ఈ పోస్ట్ తో అర్థమైపోయింది. ఇంకేముంది మరోసారి ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంట ప్రేమ గురించి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

Rashmika Mandanna Special Birth Day Wishes to Vijay Deverakonda with Cute Nick Name

Also Read : Pavani Karanam : పుష్ప 2 సినిమా వల్ల కొన్ని మంచి సినిమాలు ఛాన్సులు మిస్ అయ్యాను.. పావని వ్యాఖ్యలు వైరల్..