Pavani Karanam : పుష్ప 2 సినిమా వల్ల కొన్ని మంచి సినిమాలు ఛాన్సులు మిస్ అయ్యాను.. పావని వ్యాఖ్యలు వైరల్..
హిట్ 3 సక్సెస్ ఈవెంట్లో పావని మాట్లాడుతూ..

Pavani Karanam Missed Some Movies Due to Allu Arjun Pushpa 2 Movie
Pavani Karanam : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురు పాత్రలో నటించిన పావని పుష్ప 2 సినిమాతో బాగా వైరల్ అయింది. పుష్ప 2 సినిమాలో కథ ఆల్మోస్ట్ తన మీదే నడవడంతో ఒక్కసారిగా స్టార్ అయింది. పావని హిట్ సినిమా యూనివర్స్ లో కూడా నటించింది. హిట్ 2 సినిమాలో ఫోరెన్సిక్ నిపుణురాలిగా నటించింది. ఇటీవల నాని హిట్ 3 సినిమా రిలీజవ్వగా ఇందులో కూడా తన పాత్ర కంటిన్యూ ఉంది.
నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాలో తెరకెక్కిన హిట్ 3 సినిమా 100 కోట్లకు పైగా సాధించి భారీ హిట్ అవ్వడంతో నేడు హిట్ 3 సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సక్సెస్ ఈవెంట్లో పావని కరణం కూడా పాల్గొంది.
Also See : Srinidhi Shetty : హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్ లో.. చీరకట్టులో శ్రీనిధి శెట్టి..
హిట్ 3 సక్సెస్ ఈవెంట్లో పావని మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా వల్ల కొన్ని ఛాన్సులు మిస్ అయ్యాను. ఒక సంవత్సరం పాటు పుష్ప సినిమాకు డేట్స్ లాక్ అయిపోయాయి. రెండు మూడు మంచి సినిమాలు మిస్ అయ్యాను. ఏ మంచి అవకాశం మిస్ అయినా బాధగా ఉంటుంది. అందులో ఒకటి నాని గారి వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థలో సినిమా మిస్ అయ్యాను. పుష్ప 2 క్లైమాక్స్ లో ఉన్నప్పుడు డేట్స్ క్లాష్ అయ్యాయి. నేను అవకాశం వదులుకోవాల్సి వచ్చింది. ఏమైనా మేనేజ్ అవుతుందా అని చాలా ట్రై చేశాను. కానీ కుదరలేదు. దానికి నేను బాధపడ్డాను. కానీ హిట్ యూనివర్స్ లో ఇలా కంటిన్యూ అవుతున్నందుకు సంతోషంగా ఉంది అని తెలిపింది.
దీంతో పావని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే పలువురు ఆ ఛాన్సులు మిస్ అయినా పుష్ప 2 వల్ల నటిగా ఫేమ్ వచ్చింది, మంచే జరిగింది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే పావని మిస్ అయింది ఏ సినిమానో మాత్రం చెప్పలేదు. మీట్ క్యూట్ లేదా కోర్ట్ సినిమా అయి ఉండొచ్చు అని భావిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=4yB2hSCG2LI
Also See : Ketika Sharma : ‘సింగిల్’ భామ కేతిక శర్మ.. చీరకట్టులో స్టైలిష్ పోజులు..