Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి జీతం మొత్తం వాళ్ళకే.. పదవిలో ఉన్నంత కాలం అంతే.. పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం..

ఏకంగా ఆయన పదవిలో ఉన్నంతకాలం వచ్చే జీతాన్ని వాళ్ళ కోసం ఇచ్చేస్తానని పవన్ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి జీతం మొత్తం వాళ్ళకే.. పదవిలో ఉన్నంత కాలం అంతే.. పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం..

Pawan Kalyan Donates His Total Salary getting From Deputy CM Post to Orphans

Updated On : May 11, 2025 / 10:42 AM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు. రాజకీయాల్లో, ఏపీ ఉపముఖ్యమంత్రిగా బిజీబిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ దానాల గురించి అందరికి తెలిసిందే. సినిమాలో సంపాదించే దాంట్లో చాలా వరకు అందరికి సాయం చేయడానికే ఉపయోగిస్తూ ఉంటారు. ఆయన వద్దకు సాయం అని ఎవరు వచ్చినా ఇస్తారు. ఎంతోమంది ఆయన సాయం పొందిన వాళ్ళు బయటకి వచ్చి చెప్తే కానీ వాటి గురించి తెలియవు. చెప్పకుండా చేసినవి కోకొల్లలు.

ఇప్పటికే తన సినిమాల ఆదాయంలో చాలా భాగం దానాలకు ఇస్తుంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఆయన అందుకుంటున్న జీతం మొత్తం కూడా కొంతమందికి సాయం కోసం ఇచ్చేయడానికి సిద్ధమయ్యారు. ఒక నెల లేదా ఒక సంవత్సర జీతం దానం చేస్తున్నాడు అనుకుంటే పర్లేదు కానీ ఏకంగా ఆయన పదవిలో ఉన్నంతకాలం వచ్చే జీతాన్ని వాళ్ళ కోసం ఇచ్చేస్తానని పవన్ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also See : Pawan Kalyan : ఆ బామ్మను దగ్గరుండి తీసుకొచ్చి.. స్వయంగా వడ్డించి భోజనం పెట్టిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..

నిన్న పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ కి తన నియోజకవర్గం పిఠాపురం నుంచి పలువురు వచ్చారు. అందులో భాగంగా కొంతమంది అనాథ పిల్లలు కూడా వచ్చారు. వారి బాధలు విని చలించిన పవన్ వారికి సాయం చేయడానికి నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నా జీతం.. మీ జీవితం కోసం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించడం కూడా నా బాధ్యత. పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం, వారి చదువుల కోసం నా జీతం మొత్తం ఇస్తున్నాను. పదవి ఉన్నంతకాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తాను అని ప్రకటించారు.

Also Read : Pawan Kalyan : ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే.. 96ఏళ్ల వృద్ధురాలికి దగ్గరుండి భోజనం వడ్డించిన డిప్యూటీ సీఎం.. ఆ బామ్మ చేసిన పనికి..

నిన్న క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఆయన తన వేతనం నుంచి ఒక్కొక్కరికీ నెలకి రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 ఆర్థిక సాయం అందించారు. నిన్న అందుబాటులో ఉన్న 32 మందికి స్వయంగా అందచేయగా మిగిలిన పది మందికి జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెలా ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేశారు పవన్. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. తనకు వచ్చే జీతం కూడా మొత్తం దానం చేసేస్తుండటంతో ఇంకెన్ని దానాలు చేస్తావు స్వామీ, నీకేమి దాచుకోవా అంటూ పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది కదా పవన్ మంచితనం అంటే అని పొగుడుతున్నారు. జీతం కూడా మొత్తం దానం చేసే నాయకుడు ఉండటం గ్రేట్ అని అంటున్నారు.