Shah Rukh Khan : అంబానీ ఇంట సెలబ్రేషన్స్‌లో.. పాములతో షారుఖ్ ఆటలు.. వీడియో వైరల్..

ముకేశ్‌ అంబానీ కూతురు ఈషా అంబానీ కవల పిల్లల బర్త్ డే వేడుకలో షారుఖ్ నిజమైన పాములతో ఆటలు ఆడుతూ కనిపించారు.

Dunki star Shah Rukh Khan had real snakes in his body video gone viral

Shah Rukh Khan : దేశంలోని బడా ప్రముఖల ఇంట సెలబ్రేషన్స్ జరుగుతున్నాయనంటే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అతిథిగా అక్కడ కనిపించాల్సిందే. తాజాగా ఈ హీరో ముకేశ్‌ అంబానీ కూతురు ఈషా అంబానీ కవల పిల్లల బర్త్ డే వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక వీడియోలో షారుఖ్ నిజమైన పాములతో ఆటలు ఆడుతూ కనిపించారు.

ఆ వీడియోలో ఏమి కనిపిస్తుందంటే.. షారుఖ్ ఖాన్, అనంత్ అంబానీ తదితరులు నిలబడి మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఇంతలో అనంత్ అంబానీ పక్క వారి నుంచి ఒక పాముని తీసుకువచ్చి షారుఖ్ చేతిలో పెట్టారు. ఇంతలో షారుఖ్ వెనుక నుంచి మరెవరో వచ్చి.. బాద్‌షా మేడలో మరో పాముని వేశారు. షారుఖ్ ఖాన్ వాటికీ భయపడకుండా.. వాటిని పట్టుకొని కెమెరాలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Shah Rukh Khan : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో.. స్టార్ సింగర్ టీ కప్ మోస్తూ కనిపించిన షారుఖ్..

ఇక షారుఖ్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ లో ‘డంకీ’తో మరో బ్లాక్ బస్టర్ ని అందుకోవాలని చూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి చేస్తున్న సినిమా క్రిస్టమస్ కి వచ్చేందుకు డేట్ ని కూడా ఫిక్స్ చేసుకుంది. 3 ఇడియట్స్, PK, సంజు వంటి సినిమాలు తెరకెక్కించిన హిరానీ నుంచి వస్తున్న సినిమా కావడం, షారుఖ్ కూడా సక్సెస్ ట్రాక్ లో ఉండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’కి ఫ్రీమేక్ గా వస్తుందని టాక్. ఆ సినిమా కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. డంకీ టీజర్ కూడా అది నిజమే అని తెలియజేస్తుంది. ఇంతకీ ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’ సినిమా కథ ఏంటంటే.. తన ప్రియురాలు కోసం హీరో దొంగతనంగా అమెరికాకి బయలుదేరుతాడు. ఈమద్యలో అతను ఎదుర్కొన సమస్యలే సినిమా కథ.

 

ట్రెండింగ్ వార్తలు