‘దుర్గామతి’ – భయపడుతూ, భయపెడుతూ అలరించిన భూమి పెడ్నేకర్

  • Published By: sekhar ,Published On : November 25, 2020 / 02:14 PM IST
‘దుర్గామతి’ – భయపడుతూ, భయపెడుతూ అలరించిన భూమి పెడ్నేకర్

Updated On : November 25, 2020 / 2:32 PM IST

Durgamati The Myth Trailer: ప్రస్తుతం పలు తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ మూవీ ‘దుర్గామతి ది మిత్’ పేరుతో తెరకెక్కింది.

తెలుగులో తెరకెక్కించిన అశోక్ ఈ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించింది. బుధవారం ట్రైలర్ రిలీజ్ చేశారు.


భూమి ఇంతకుముందెన్నడూ చేయని సరికొత్త క్యారెక్టర్లో కనిపించింది. భయపడుతూ, భయపెడుతూ దుర్గామతిగా నార్త్ ప్రేక్షకులను అలరించనుంది.

పర్ఫార్మెన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. నటనకు ఆస్కారమున్న ఈ క్యారెక్టర్ ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.


జయరాం పాత్రలో అర్షద్ వార్షి కనిపించనున్నాడు. జిస్సు సేన్‌గుప్తా, కరణ్ కపాడియా, మహిగిల్ కీలక పాత్రల్లో నటించారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

టీ సిరీస్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. డిసెబంర్ 11న ‘దుర్గామతి ది మిత్’ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకులముందుకు రానుంది.