Duvvada Srinivas
Duvvada Srinivas : తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి దివ్వెల మాధురి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లు దువ్వాడ శ్రీనివాస్ పక్కన తిరుగుతూ మాధురి బాగా వైరల్ అయింది. బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో దువ్వాడ కూడా మాధురిని ఎంకరేజ్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లో ఆడుతుంటే దువ్వాడ శ్రీనివాస్ బయట ఆమెని ప్రమోట్ చేస్తున్నారు.(Duvvada Srinivas)
ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. దివ్వెల మాధురి ఒకవేళ బిగ్ బాస్ గెలిస్తే వచ్చే డబ్బులను ఏం చేస్తారు అని అడిగారు.
దీనికి దువ్వాడ శ్రీనివాస్ సమాధానమిస్తూ.. బిగ్ బాస్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీని వికలాంగులకు, క్యాన్సర్ వచ్చిన వాళ్లకు, పేద ప్రజలకు ఉపయోగిస్తాం. మాకు ఎందుకు ఈ డబ్బులు. మాకు భగవంతుడు ఇచ్చింది చాలు. మేము చేసే సర్వీస్ లో ఈ డబ్బులు కూడా కలిపి చేస్తాము అని అన్నారు.