Duvvada Srinivas : మాధురిని మిస్ అవుతున్నాను.. తను లేని లోటు తెలుస్తుంది.. వెళ్లేముందు నా కోసం.. దువ్వాడ శ్రీనివాస్ ఎమోషనల్..
దువ్వాడ శ్రీనివాస్ మాధురి బిగ్ బాస్ కి వెళ్లిపోవడంతో ఆమెని మిస్ అయినట్టే అని ఎమోషనల్ అయ్యారు. (Duvvada Srinivas)

Duvvada Srinivas
Duvvada Srinivas : తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోకి దివ్వెల మాధురి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాధురి హౌస్ లో బాగా ఆడటానికి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ బయట ఆమెని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి, దివ్వెల మాధురి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.(Duvvada Srinivas)
అయితే ఈ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి బిగ్ బాస్ కి వెళ్లిపోవడంతో ఆమెని మిస్ అయినట్టే అని ఎమోషనల్ అయ్యారు.
దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా మేము ఎక్కడికెళ్లినా ఇద్దరం కలిసే వెళ్తున్నాం. ప్రతి నిమిషం కలిసే ఉంటాం. తను వెళ్ళిపోయాక నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అలా కుర్చున్నాను అంతే. ఇంకా ఆ చిరాకు నుంచి బయట పడలేదు. ఒక నాలుగైదు రోజులు పడుతుందేమో. తనతో ఒక అటాచ్మెంట్ ఉంది. మనకు ఒక మంచి స్నేహం, రిలేషన్ ఉంటే మనశాంతి ఉంటుంది. బయట ఎలా అయినా ఉంటాను కానీ మా ఇద్దరికీ ఇంత పెద్ద గ్యాప్ వస్తే చాలా ఇబ్బందే నాకు. తను ఉంటే నాకు టైంకి అన్ని ఉంటాయి.
తను వెళ్లిపోయిన తర్వాత అన్ని లేట్ అవుతున్నాయి. తను వెళ్లేముందు నా కోసం ఒక 12 మంది స్టాఫ్ ని రెడీ చేసి ఎవరెవరు నాకు ఏం పనిచేసి పెట్టాలి అని చెప్పి వెళ్ళింది. వాళ్లంతా నా చుట్టూనే తిరుగుతూ పని చేస్తున్నారు. కానీ తను లేని లోటు ఉంది. నేను ఆమెని మిస్ అవుతున్నట్టే. ఆప్యాయత ప్రేమతో చూసుకునే మనిషిని మిస్ అవుతున్నాను. 2022 నుంచి నన్ను తనే చూసుకుంటుంది. ఎప్పుడూ ఇద్దరం కలిసే ఉంటాము కాబట్టి ఇప్పుడు నాకు అయితే ఇబ్బందే అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు.