Duvvada Srinivas : మా ఇద్దర్ని బిగ్ బాస్ కి రమ్మని అడిగారు.. నేను ఎందుకు వెళ్ళలేదంటే.. దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ వైరల్..
తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ దీనిపై స్పందించారు. (Duvvada Srinivas)

Duvvada Srinivas
Duvvada Srinivas : తాజాగా బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీతో దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె కోసం దువ్వాడ శ్రీనివాస్ బయట ప్రమోట్ చేస్తున్నారు. గతంలో దివ్వెల మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇద్దరూ జంటగా బిగ్ బాస్ లోకి వెళ్తారని రూమర్స్ వచ్చాయి.(Duvvada Srinivas)
తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ దీనిపై స్పందించారు. మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్తారని వార్తలు వచ్చాయి, ఇద్దరూ జంటగా వెళ్తారని అనుకున్నారు అని అడిగారు.
దువ్వాడ శ్రీనివాస్ సమాధానమిస్తూ.. బిగ్ బాస్ ఎలా కండక్ట్ చేస్తారో నాకు తెలీదు. వైల్డ్ కార్డు మీద కొంతమంది వస్తారు, వెళ్ళినవాళ్ళు కూడా వస్తారు. బిగ్ బాస్ టీమ్ కి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మళ్ళీ పిలిచినప్పుడు చూస్తాను. మొదట మా ఇద్దర్ని కలిసి రమ్మని అడిగారు. కానీ బయట నాకు బిజినెస్ లు ఉన్నాయి కాబట్టి కుదరదు. అందుకే నేను వద్దు అనుకోని మాధురిని పంపించాలి అని డిసైడ్ అయ్యాను. నేను ఎలాగో బయటే అన్ని కష్టాలు, జైలు జీవితం, సక్సెస్, ఉద్యమాలు ఇవన్నీ చూసాను. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ మాధురికి అనుభవం రావాలి. అందులోను మహిళగా ఆమె ముందుకు వెళ్ళాలి. అందుకనే ఆమెని పంపించాను అని తెలిపారు. మరి భవిష్యత్తులో దువ్వాడ శ్రీనివాస్ కూడా బిగ్ బాస్ కి వెళ్తారేమో చూడాలి.
Also Read : Telusu Kada Trailer : ‘తెలుసు కదా’ ట్రైలర్ చూశారా? ఇద్దరి అమ్మాయిలతో ఇదేదో కొత్తగా ఉందే..