Duvvada Srinivas : మాధురికి అతనే టఫ్ కాంపిటేషన్.. కామన్ సెన్స్ లేదా అలాంటి గేమ్స్ ఎలా పెడతారు.. దువ్వాడ శ్రీనివాస్ ఫైర్..
తాజాగా దువ్వాడ శ్రీనివాస్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Duvvada Srinivas)

Duvvada Srinivas
Duvvada Srinivas : తాజాగా తెలుగు బిగ్ బాస్ లోకి దివ్వెల మాధురి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాధురి హౌస్ లో బాగా ఆడటానికి డిసైడ్ అయితే దువ్వాడ శ్రీనివాస్ బయట ఆమెని బాగా ప్రమోట్ చేయడానికి ఫిక్స్ అయి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.(Duvvada Srinivas)
బిగ్ బాస్ లో మాధురికి ఎవరు బాగా టఫ్ అనుకుంటున్నారు అని అడగ్గా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇమ్మాన్యుయేల్ బాగా ఆడుతున్నాడు. అతను టఫ్ కాంపిటేషన్ ఇస్తాడు మాధురికి. మిగిలిన వాళ్లంతా డల్ ఫేసెస్ తో, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. వాళ్ళు పెట్టుకునే రిలేషన్స్ అన్ని రాంగ్ రిలేషన్స్. ఇమ్మాన్యుయేల్ మాత్రం సరదాగా నవ్విస్తాడు. అందరితో బాగా ఉంటాడు. అతను బాగా ఆడుతున్నాడు అని అన్నారు.
Also Read : Telusu Kada Trailer : ‘తెలుసు కదా’ ట్రైలర్ చూశారా? ఇద్దరి అమ్మాయిలతో ఇదేదో కొత్తగా ఉందే..
అలాగే బిగ్ బాస్ లో కొన్ని గేమ్స్ గురించి స్పందిస్తూ.. బిగ్ బాస్ కాన్సెప్ట్ లో కొన్ని ఇల్లీగల్ గా వెళ్తున్నారు, కాంట్రవర్సీ చేస్తున్నారు. అమ్మాయిలకు – అబ్బాయిలకు మధ్య గేమ్స్ ఏంటి కామన్ సెన్స్ లేదా? లేడీస్ కి శారీరిక శక్తి తక్కువ ఉంటుంది నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలకు బాడీ ఉంటుంది బ్రెయిన్ ఉండదు. వాళ్లిద్దరికీ కలిపి గేమ్స్ పెడితే ఎలా. అబ్బాయి అమ్మాయిని తోసేసి గెలిచేసాను అంటే ఎలా. అమ్మాయిలకు అమ్మాయిలతో పోటీ పెట్టాలి. అప్పుడు సరైన గేమ్ అవుతుంది. వీళ్ళు పెట్టె గేమ్స్ రాంగ్. అలాంటి గేమ్స్ కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అయ్యారు.
Also Read : Raviteja : నా ఫేవరేట్ సినిమా అదే.. కానీ జనాలకు నచ్చలేదు.. ఫ్లాప్ సినిమాపై రవితేజ కామెంట్స్..